భారీ లాభాలు : 10100 ఎగువకు నిఫ్టీ

3 Jun, 2020 09:24 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్  ఆరంభించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు, దేశీయ  ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడనుందన్న అంచనాల మధ్య కీలక సూచీలు  రెండూ  జోరుగా కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్  540 పాయింట్లు ఎగిసి  34363 వద్ద, నిప్టీ 153 పాయింట్ల లాభంతో 10131వద్ద  ఉత్సాహంగా కొనసాగుతోంది.  దీంతో సెన్సెక్స్ సాంకేతికంగా 34 వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 10100 స్థాయిని అధిగమించడం విశేషం.   మార్చి 13  తరువాత మళ్లీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.  బ్యాంక్  నిఫ్టీ  21వేల స్థాయిని  దాటింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్  సెక్టార్ లో కొనుగోళ్ల   సందడి నెలకొంది.  ఆటో,  మెటల్ సహా  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

బజాజ్ ఫైనాన్స్,  ఐసీఐసీఐ బ్యాంక్ భారీ లాభాలతో ఉన్నాయి. అలాగే క్యూ 4 నికర లాభం 26.5 శాతం ఎగియడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ 6 శాతం  లాభాలతో వుంది.  మార్చి ఫలితాలతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కూడా 6 శాతం  ఎగిసింది. మరోవైపు అరబిందో ఫార్మా,  బీపీసీఎల్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌తో సహా మొత్తం 15 కంపెనీలు తమ మార్చి త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నాయి.
 

మరిన్ని వార్తలు