లాభ నష్టాల ఊగిసలాటలో సూచీలు

31 Jan, 2020 14:27 IST|Sakshi

గరిష్టం నుంచి 450 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

బ్యాంకి నిఫ్టీ లాభాలతో, తిరిగి పుంజుకున్న సూచీలు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఊగిసలాటల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలను మిడ్‌సెషన్‌కు నష్టాల్లోకి మారాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 41వేల స్థాయిని, నిఫ్టీ 12వేల దిగువకు కోల్పోయింది. అయితే కేంద్ర ఎకానమీ చీఫ్‌ అడ్వైజర్‌ క్రిష్ణమూర్తి  2019-20 ఆర్థిక సంవత్సరపు ఎకానమి సర్వేని  మీడియాముందు  ఉంచుతున్న నేపథ్యంలో స్వల్పంగా లాభపడుతున్నాయి.  ప్రస్తుతం  సెన్సెక్స్‌ 74 పాయింట్లు పుంజుకుని 40981 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో12038 వద్ద కొనసాగుతోంది. రేపు (ఫిబ్రవరి1, శనివారం) లోక్‌ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తతంగా వ్యవహరించే అవకాశం వుంది.  మెటల్‌, ఫార్మా, ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల ధోరణి  నెలకొంది.   ప్రధానంగా కోటక్‌ మహీంద్రద, ఎస్‌బీఐ తదితర బ్యాంకు షేర్ల లాభాలతో  మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, ఐఓసీ, పవర్‌ గ్రిడ్‌, ఓఎన్‌జీసీ టాప్‌ లూజర్స్‌గాను, ఇన్ఫ్రాటెల్‌, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ అటో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు స్వల్ప లాభాలతో నూ  కొనసగుతున్నాయి. 

మరిన్ని వార్తలు