లాభాల్లోకి మళ్లిన స్టాక్‌మార్కెట్లు

13 Dec, 2017 12:01 IST|Sakshi

సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. నష్టాలతో ప్రారంభమైన కీలక సూచీలు  కొనుగోళ్ల జోరుతో సెంచరికి పైగా లాభాలతో జోరుగా ఉన్నాయి. ముఖ్యంగా  సెన్సెక్స్‌ 119 పాయింట్లు ఎగిసి 33, 347వద్ద , నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి  10,280వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచిన కారణంగా ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఒక్కసారిగా టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. మెటల్‌, రియల్టీ మినహా దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్‌లో  ట్రేడ్‌ అవుతున్నాయి.  ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టీ ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. అలాగే ప్రయివేట్‌బ్యాంక్‌, ఆటో, ఐటీ లాభాలు మార్కెట్‌ను లీడ్‌ చేస్తున్నాయి.
యూబీఎల్‌, పిడీలైట్‌, టైటన్‌, ఎంఆర్‌పీఎల్‌, సన్‌ టీవీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, పిడిలైట్‌, హెక్సావేర్‌, ఐవోసీ, జేపీ, ఫోర్టిస్‌ 4-2 శాతం లాభాలతో ఉండగా,  సెంచురీ టెక్స్‌, ఇండిగో, ముత్తూట్‌ ఫైనాన్స్‌, హావెల్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వేదాంతా, ఐఆర్‌బీ, పీటీసీ, కెనరా బ్యాంక్‌, ఆర్‌కామ్‌  నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు