లాభాల్లోకి మార్కెట్లు: టీసీఎస్‌ అదుర్స్‌

23 Apr, 2018 10:39 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనా, తరువాత పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి. గ్లోబ్ల్‌వీక్‌ ట్రెండ్‌ స్వల్ప హెచ్చుతగ్గులకు  లోనవుతున్న  కీలక సూచీలు ఇన్వెస్టర్ల  కొనుగోళ్లతో​ లాభాలవైపు మళ్లాయి.  సెన్సెక్స్‌  ప్రస్తుతం 85 పాయింట్లకు పైగా ఎగ ిసి 34,500 వద్ద   సెన్సెక్స్‌ నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 10,595వద్ద కొనసాగుతోంది.   
 బ్యాంక్‌ నష్టాలు కొనసాగుతుండగా,  రియల్టీ, మెటల్‌  లాభాల్లో ఉన్నాయి. ముఖ‍్యంగా  100 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అధిగమించిన టీసీఎస్‌ 3500  వద్ద ఆల్‌టైం గరిష్టం వద్ద కొనసాగుతోంది. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, జీ, అల్ట్రాటెక్‌, ఐబీ హౌసింగ్‌, ఐవోసీ, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, హిందాల్కో, టీసీఎస్‌ లాభాల్లో,  ఐసీఐసీఐ, సిప్లా, ఇన్ఫోసిస్‌, హీరోమోటో, భారతీ, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు