నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు 

24 Dec, 2019 15:12 IST|Sakshi

సాక్షి,ముంబై:  ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు మిడ్‌ సెషన్‌నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. అమ్మకాలతో  కీలక సూచీలు రెండు ప్రధాన మద్దతు స్థాయిల దిగువకు చేరాయి. ప్రస్తుతం  సెన్సెక్స్‌ 190 పాయింట్ల నష్టంతో 41452 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 11212 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు  బలహీనంగా ఉ న్నాయి. బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, గెయిల్‌, విప్రో నష్టపోతుండగా,  యస్‌ బ్యాంకు, ఇండస్‌బ్యాంకు,ఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొ, హీరో మోటో కార్ప్‌, భారతి ఎయిర్‌టెల్‌ లాభపడుతున్నాయి. మంగళవారం స్టాక్‌ సూచీలు దాదాపు అక్కడక్కడే ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6 పాయింట్ల లాభంతో 41,650 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 12,264 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

మరిన్ని వార్తలు