బుధవారం వార్తల్లోని షేర్లు

20 May, 2020 09:57 IST|Sakshi
stocks in news

వివిధ వార్తలకు అనుగుణంగా నేడు స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు 

క్యూ4 ఫలితాలు: బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జూబ్లెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, కల్పతరు పవర్‌, మాట్రిమోనీ డాట్‌ కమ్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌ కంపెనీలు  మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించనున్నాయి.

సీమెన్స్‌:  రూ.8,500 కోట్లకు పైగా విలువ కలిగిన 24 శాతం వాటాను సీమెన్స్‌ గ్యాస్‌ అండ్‌ పవర్‌ హోల్డింగ్‌ బీవీ కంపెనీకి  జర్మన్‌కు చెందిన సీమెన్స్‌ అక్టియెంజెల్స్‌ చాఫ్ట్‌ విక్రయించింది.

ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌, బ్లాక్‌స్టోన్‌,కేకేఆర్‌, అపెక్స్‌లు ముంబై  కేంద్రంగా పనిచేస్తోన్న ఎడెల్వీజ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌(ఈజీఐఏ)లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు పోటిపడుతున్నాయి.

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌: జనవరి-మార్చి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12.9 శాతం పెరిగి రూ.427.5 కోట్లకు చేరినట్లు ఎల్‌అండ్‌టీ కంపెనీ వెల్లడించింది.గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.378.5 కోట్లుగా నమోదైందని తెలిపింది.

సనోఫీ: మార్చితో ముగిసిన క్యూ4లో నికర లాభం 8 శాతం పడిపోయి రూ.85.4 కోట్లుగా నమోదైందని సనోఫీ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.92.9 కోట్లుగా నమోదైనట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ: మార్చితో ముగిసిన త్రైమాసికంలో  తన యూనిట్‌ హోల్డర్లకు రూ.531.67 కోట్లు పంపిణీ చేసినట్లు ఈ కంపెనీ వెల్లడించింది.

టాటాపవర్‌: జనవరి-మార్చితో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.475 కోట్లకు చేరిందని టాటా పవర్‌ ప్రకటించింది.

అపోలో టైర్స్‌: క్యూ4లో ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7.36 శాతం తగ్గి రూ.77.8 కోట్లుగా నమోదైందని అపోలో టైర్స్‌ తెలిపింది.

జేఎంసీ ప్రాజెక్ట్స్‌:మార్చితో ముగిసిన క్యూ4లో  నికర నష్టం రూ.34.38 కోట్లుగా నమోదైందని జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.48.70 కోట్లుగా నమోదైందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

Related Tweets
మరిన్ని వార్తలు