కొటక్‌ మహీంద్రా, సెయిల్‌లపై ఫోకస్‌

1 Jun, 2020 10:26 IST|Sakshi

వివిధ వార్తలకు అనుగుణం‍గా నేడు స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు 

అదాని పవర్‌: అదాని పవర్‌ మొత్తం ఈక్విటీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి డీలిస్ట్‌ చేసే ప్రతిపాదనపై సమీక్షించేందుకు ఈకంపెనీ బోర్డు బుధవారం సమావేశం కానుంది.

క్యూ4ఫలితాలు: వీ గార్డ్‌ ఇండస్ట్రీస్‌, ఓరియంట్‌ ఎలక్ట్రీక్‌,అక్విన్‌ అగ్రిటెక్‌, బిర్లా కేబుల్‌, అల్ట్రామెరైన్‌ అండ్‌ పిగ్మెంట్స్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను  సోమవారం వెల్లడించనున్నాయి.

సెయిల్‌: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 83 శాతం పెరిగి రూ.111 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.60.68 కోట్లుగా ఉంది.

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌: క్విప్‌ ద్వారా రూ.7,442.5 కోట్లను సమీకరించినట్లు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. ఒక్కో షేరును రూ.1,145 చొప్పున 6.5 కోట్ల షేర్లను విక్రయించింది.

మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 55.53 శాతం తగ్గి రూ.15.49 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.34.84 కోట్లుగా నమోదైందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో హెల్త్‌కేర్‌ తెలిపింది.

వి-మార్ట్‌: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో స్టాండెలోన్‌ నికర నష్టం రూ.8.43 కోట్లుగా నమోదైనట్లు వి-మార్ట్‌ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.9042 కోట్లుగా ఉన్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ పేర్కొంది.

ఆర్సీఎఫ్‌: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ.142.38 కోట్లుగా నమోదైనట్లు రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఆర్‌సీఎఫ్‌) వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.47.16 కోట్లుగా ఉన్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

కెఈసీ ఇంటర్నేషనల్‌: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 3 శాతం తగ్గి రూ.192.88 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.198.76 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.

జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.260.90 కోట్లు గా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.100.65 కోట్లుగా నమోదైంది.

సాగర్‌ సిమెంట్స్‌: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 94 శాతం తగ్గి రూ.1.18 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2018-19 ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.18.75 కోట్లుగా ఉంది.

వోల్టాస్‌: క్యూ4లో  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12.52శాతం పెరిగి రూ.159.50 కోట్లుగా నమోదైనట్లు వోల్టాస్‌ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.141.74 కోట్లుగా ఉందని ఈ కంపెనీ తెలిపింది.

Related Tweets
మరిన్ని వార్తలు