రిలయన్స్‌,కొటక్‌ మహీంద్రాలపై ఫోకస్‌​

3 Jun, 2020 09:57 IST|Sakshi

వివిధ వార్తలకు అనుగుణంగా నేడు స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు 

క్యూ4 ఫలితాలు: బీపీసీఎల్‌, అరబిందో ఫార్మా,ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఓరియంట్‌ హోటల్స్‌, డీసీఎం శ్రీరామ్‌, చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ అమిక్స్‌, వెసువీఎస్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించనున్నాయి.

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: ఈ కంపెనీ రూ.53,124 కోట్ల రైట్స్‌ ఇష్యూ ఈ రోజుతో ముగియనుంది.

యస్‌ బ్యాంక్‌: షేర్ల విక్రయం ద్వారా మూలధనాన్ని సమకూర్చుకునేందుకు యస్‌ బ్యాంక్‌ ఆరు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను నియమించిందని, రైట్స్‌ ఇష్యూ, క్విప్‌ల ద్వారా రూ.10,000 కోట్లను సమీకరించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

లుపిన్‌: ఆస్టియో ఆర్థరైటిస్‌ నొప్పుల నివారణలో వినియోగించే మెలాక్సికెమ్‌ క్యాప్సూల్‌ను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు అమెరికా హెల్త్‌ రెగ్యు‍లేటరీ ఆమోదం తెలిపినట్లు ఫార్మా కంపెనీ లుపిన్‌ వెల్లడించింది.

డిక్సన్‌ టెక్నాలజీస్‌: వచ్చే 8-9 నెలల కాలంలో రూ.250 కోట్ల పెట్టుబడులను పెట్టి తమ వాప్యారాన్ని విస్తరిస్తామని, ఇందులో భాగంగా 2,500 మంది సిబ్బందిని నియమించుకుంటామని ఈ కంపెనీ తెలిపింది.

కొటక్ మహీంద్రా:రూ.6,900 కోట్ల విలువైన 2.8 శాతం వాటాను ఉదయ్‌ కొటక్‌ విక్రయించి, బ్యాంక్‌లో తన వాటాను కొంతమేర తగ్గించుకున్నారు.

సిన్‌జీన్‌ ఇంటర్నేషనల్‌: కోవిడ్‌-19 పరిక్షలో ఉపయోగించే ఎలిసా టెస్ట్‌ కిట్లను తయారు చేసేందుకు హై మీడియా ల్యాబొరేటరితో కలిసి పనిచేయనున్నట్లు సిన్‌జీన్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌: బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెమెనోస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మధ్య వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఈ కంపెనీ తెలిపింది.

ధర్మపూర్‌ సుగర్స్‌: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం మార్జినల్‌గా తగ్గి రూ.104.07 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం 108.82 కోట్లుగా ఉన్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలోలో కంపెనీ పేర్కొంది.

టాటా టెలీ సర్వీసెస్‌: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర నష్టం రూ.874 కోట్లుగా నమోదనట్లు టాటా టెలీ సర్వీసెస్‌ తెలిపింది.

టీసీఐ: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 25 శాతం తగ్గి రూ.36.15 కోట్లుగా నమోదైనట్లు టీసీఐ తెలిపింది.

Related Tweets
మరిన్ని వార్తలు