బంగారం వెలవెల..సెన్సెక్స్ మిలమిల!

29 Jul, 2014 16:41 IST|Sakshi
బంగారం వెలవెల..సెన్సెక్స్ మిలమిల!
2014లో మార్కెట్ లో బంగారంపై పైచేయి భారత ఈక్వీటిలు సాధించింది. మార్కెట్ లో బంగారం ధర 5 శాతం క్షీణించడంతో ప్రస్తుతం సంవత్సరంలో ఈక్విటీలపై 23 శాతం  లాభాల్ని ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నారు. 
 
బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 22.76 శాతం వృద్ధిని ఇన్వెస్టర్లకు అందించించింది. విదేశీ నిధుల ప్రవాహం, దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగ్గా ఉండటంతో భారత ఈక్వీటీలు మంచి వృద్ధిని సాధించాయి. సాధారణంగా ఈక్వీటీలు జోరుమీదున్నప్పుడు బంగారం ధరలు తగ్గడం సాధారణంగా జరుగుతుంటాయి. 
 
2013 డిసెంబర్ 31 తేదిన 10 గ్రాముల బంగారం ధర 29800, వెండి ధర కేజీకి 43755 వేలు.  అయితే క్రితం ముగింపులో బంగారం 28370 వద్ద, వెండి 44800 వద్ద ముగిసింది. 
 
గత డిసెంబర్ లో సెన్సెక్స్ 21,170 పాయింట్లను నమోదు చేసుకోగా, ప్రస్తుతం జీవితకాలపు గరిష్ట స్థాయిని 26300 నమోదు చేసుకుని గత శుక్రవారం 25,991 వద్ద స్థిరపడింది. 

 

మరిన్ని వార్తలు