భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు

2 Oct, 2014 14:23 IST|Sakshi
భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు

న్యూయార్క్: 'ఎబోలా' అమెరికా స్టాక్మార్కెట్ ను వణింకించింది. అమెరికాలో ఒకరికి ఎబోలా వైరస్  సోకిందన్న సమాచారం వాల్స్ట్రీట్ ను కుదిపేసింది. డౌజోన్స్, నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి.

జపాన్ -420(-2.68 శాతం), హాంకాంగ్ -296(-1.29శాతం), సింగపూర్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పడిపోయాయి. భారత మార్కెట్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు పతనమైంది.

మరిన్ని వార్తలు