స్టాక్స్‌ వ్యూ

1 Oct, 2018 02:15 IST|Sakshi

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.275   టార్గెట్‌ ధర: రూ.743

ఎందుకంటే: వాధ్వాన్‌ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న ఈ కంపెనీ.. భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల వారికి రుణాలివ్వడంపై దృష్టి సారించే ఏౖMðక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కూడా ఇదే. 352 నగరాల్లో రూ.1,20,900 కోట్ల నిర్వహణ ఆస్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త గృహాల కొనుగోళ్లు, రీసేల్‌ హౌజ్‌ ప్రొపర్టీ, ఇళ్ల రిపేర్లకు, ఎక్స్‌టెన్సన్‌కు అవసరమైన రుణాలందిస్తోంది. ఇటీవల లిక్విడిటీ సమస్య కారణంగా కుదేలైన కంపెనీ షేర్లలో ఈ షేర్‌ కూడా ఉంది.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ బాండ్లలో భారీగా ఇన్వెస్ట్‌చేసిన డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌... ఇన్వెస్టర్ల నుంచి రిడంప్షన్‌ ఒత్తిడి అధికంగా ఉండటంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కమర్షియల్‌ పేపర్‌(సీపీ)ను డిస్కౌంట్‌కు విక్రయించింది. దీంతో ఈ నెల 21న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 42% పతనమైంది.  అయితే ఈ కంపెనీ సమీకరించిన మొత్తం రుణాల్లో సీపీ ద్వారా సమీకరించిన రుణాలు 8 శాతం వరకూ మాత్రమే ఉన్నాయి. రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ కాలేదని, వచ్చే ఏడాది 2019 వరకూ చెల్లించే రుణాలకు చెల్లించడానికి అవసరమైన నిధులు ఉన్నాయని, ఎలాంటి లిక్విడిటీ సమస్య లేదని కంపనీ ధీమాను వ్యక్తం చేసింది. 

ఈ కంపెనీ  నిధుల సమీకరణ  వ్యయం 8.65 శాతంగా ఉంది. కంపెనీ ఇచ్చిన రుణాల్లో 99 శాతం వరకూ  ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలు కావడంతో వడ్డీ రేట్లు పెరిగినా, వాటిని వినియోగదారులకు బదలాయించే వెసులుబాటు కంపెనీకి ఉంది.  నికర వడ్డీ మార్జిన్‌ 3–3.85 శాతం రేంజ్‌లోనే ఉంచేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ స్థాయిలో రుణ ఎగవేతలు, కలెక్షన్, రికవరీ టీమ్స్‌ పటిష్టంగా ఉండటం, రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, వివిధ మార్గాల ద్వారా రుణాల సమీకరణ కారణంగా నిధుల వ్యయం తగ్గుతుండటం, రుణ నాణ్యత నిలకడగా ఉండటం సానుకూలాంశాలు.


టాటా కెమికల్స్‌ - కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.690    టార్గెట్‌ ధర: రూ.956
ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే కిచిడి మిక్స్, చట్నీ తదితర ఐదు సెగ్మెంట్లలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. అయితే వీటిని ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయిస్తోంది. టాటా సాల్ట్, టాటా సాల్ట్‌ లైట్, పప్పు ధాన్యాలు, శనగపిండి తదితర ఉత్పత్తులను సాధారణ కిరాణా దుకాణాల ద్వారా  అందిస్తోంది.  ఐ–శక్తి బ్రాండ్‌ కింద పప్పు ధాన్యాలను విక్రయిస్తోంది.టాటా సంపన్న్‌ బ్రాండ్‌ కింద  ఐదు రకాలైన (సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, శనగపిండి, చట్నీలు, మిక్స్‌) ఉత్పత్తులను వివిధ వేరియంట్లలో అందిస్తోంది.

మరో ఐదు రకాలైన సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. 17 లక్షల రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా తన ఉత్పత్తులను అందిస్తోంది. ఉప్పు కాకుండా ఇతర ఉత్పత్తులతో కూడిన టాటా సంపన్న్‌ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. తక్కువ మార్జిన్లు వచ్చినప్పటికీ, అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత విలువాధారిత ఉత్పత్తులను కూడా అందించడం ద్వారా మార్జిన్లను పెంచుకోవాలనేది కంపెనీ వ్యూహం.

టాటా కెమికల్స్‌ అందించే ఉత్పత్తుల ధరలన్నీ.. ఇతర కంపెనీల ఉత్పత్తుల ధరల కంటే 10–15% అధికం. కంపెనీకి కామధేనువు లాంటి సోడా యాష్, సోడియం బైకార్బొనేట్‌ల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెటింగ్‌పై పెట్టుబడులను రెట్టింపు చేస్తోంది. రెండేళ్లలో ఆదాయం, నికర లాభం చెరో 10% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం.

మరిన్ని వార్తలు