ప్రమోటర్ల వాటా పెరిగినా., పతనమైన షేర్లు ఇవే..!

21 May, 2020 14:10 IST|Sakshi

24కంపెనీల్లో వాటాను పెంచుకున్న ప్రమోటర్లు

ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న షేర్లు 50శాతం క్రాష్‌

స్టాక్‌ మార్కెట్‌ పతనాన్ని ప్రమోటర్లు తమ సొంత కంపెనీల్లో వాటాను పెంచుకునే అవకాశంగా మలుచుకుంటున్నారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో ఓపెన్‌ మార్కెట్‌ కొనుగోళ్ల పద్దతిలో సుమారు 24కంపెనీల్లో ప్రమోటర్లు వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్‌ విధింపుతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ... త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు కంపెనీలకు అదనపు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్1 నుంచి జూన్30 వరకు కంపెనీల వాటాలనుప్రమోటర్లు, ఇతర ఇన్‌సైడర్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది.

గడచిన 6నెలల్లో సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, వైభవ్‌ గ్లోబల్‌, చంబల్‌ ఫెర్టిలైజర్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, ఏపిఎల్‌ అపోలో ట్యూబ్స్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు. 

సన్‌ఫార్మా(2 శాతం), దీపక్‌ ఫెర్టిలేజర్స్‌(3 శాతం), వైభవ్‌ గ్లోబల్‌(19 శాతం) షేర్లు తప్ప ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 50శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 20శాతం క్షీణించింది. 

రెగ్యూలేటరీలు ఫార్మా కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఫార్మా రంగానికి కలిసొచ్చింది. అలాగే ఆదాయాల రికవరీపై ఆశలను పెంచింది. ఐదేళ్ల పనితీరు తర్వాత వాల్యూయేషన్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారితో  ఈ రంగం చాలా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఫార్మా రీ-రేటెడ్‌ అవుతుందని మేము నమ్ముతున్నాము.

  • కోటక్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఫండ్‌ మేనేజర్‌ అన్షుల్‌ సైగల్‌  

నవ భారత్‌ వెంచర్స్‌, సైయెంట్‌, జామ్నా అటో, జెన్సార్‌ టెక్నాలజీస్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, వక్రంజీ, గ్రేవీస్‌ కాటన్‌, జాగరణ్‌ ప్రకాశణ్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రా, వాలియంట్ కమ్యూనికేషన్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, సీసీఎల్‌ ప్రాడెక్ట్స్‌, కంపెనీల ప్రమోటర్లు అక్టోబర్‌-మార్చి నెలలో తమ సంస్థల్లో వాటాను పెంచుకున్నారు. ఈ కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 10-55శాతం నష్టాలను చవిచూశాయి. 

 
ప్రమోటర్లు సొంత కంపెనీల్లో వాటాను ఎప్పుడు పెంచుకుంటారు..?

  • కంపెనీ స్టాక్‌ విలువ పెరుగుతుందని తెలిసినప్పుడు 
  • కంపెనీ లేదా సంబంధిత రంగంలో సానుకూల డెవలప్‌మెంట్‌ ఉన్నప్పుడు
  • కొన్ని సార్లు కంపెనీ నియంత్రణ ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రమోటర్లు తన కంపెనీలో వాటాను పెంచుకుంటాడు. 

ప్రమోటర్లు ఆకర్షణీయమైన ధరలకు వాటాలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా సొంత కంపెనీలో వాటా కొనుగోలు అనేది వారి వ్యాపారాలపై విశ్వాసం చూపించడానికి ఒక మార్గం. అయినప్పటికీ, వారి ఇన్వెస్ట్‌మెంట్‌ పరిమాణం చిన్న ఇన్వెసర్ల కంటే ఎక్కువగా ఉన్నందున వాటిని గుడ్డిగా అనుసరించకూడదు అని షేర్‌ఖాన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ గౌరవ్ దువా పేర్కోన్నారు.

మరిన్ని వార్తలు