లాభాల ముగింపు: బ్యాంక్స్‌ అప్‌, ఐటీ డౌన్‌

27 Aug, 2019 15:41 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లో ముగిసాయి. రోజంతా లాభాల మధ్య ఊగిసలాట కొనసాగినా చివరకు  కీలక మద్దతు స్థాయిలకుపైన స్థిరంగా ముగిసాయి.   ఇంట్రా డేలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన  సెన్సెక్స్‌   147  పాయింట్లు ఎగిసి 37641 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 11105 వద్ద  ముగిసాయి.  ఒక్క ఐటీ,  ఫార్మ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది. ఇండస్‌ ఇండస్‌, ఎస్‌బ్యాంకు, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌,  పవర్‌ గ్రిడ్‌, బ్రిటానియా, టాటా స్టీల్‌ టాప్‌ వినర్స్‌గా  నిలిచాయి. వీటితో సుగర్‌, సిమెంట్‌ షేర్లు కూడా లాభాల్లో ముగిసాయి.  మరోవైపు  భారతి ఎయిర్‌టెల్‌, ఇండియా బుల్స్‌,  ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్ర నష్టపోయాయి. అటు ఆర్‌బీఐ కేంద్రానికి  డివిడెండ్‌ చెల్లింపు ప్రకటనతో  దేశీయ కరెన్సీ  రికార్డు కనిష్టంనుంచి తేరుకుని పాజిటివ్‌గా ఉంది.

మరిన్ని వార్తలు