ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు సెబీ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్!

9 May, 2016 01:18 IST|Sakshi
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు సెబీ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్!

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల గురించి పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలలో అవగాహన పెంచడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. ఫైనాన్షియల్ మార్కెట్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి నేరాలు చాలా వరకు సంక్లిష్టంగా ఉంటాయని, ఏజెన్సీలు వాటిని అర్థం చేసుకోవడం కొంత కష్టసాధ్యమని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

ఏజెన్సీలకు ఫైనాన్షియల్ క్రైమ్ గురించి వివరిస్తే.. అవి నేరాలను సమర్థంగా ఎదుర్కోడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ చర్య పోంజి స్కీమ్స్ వంటి తదితర క్యాపిటల్ మార్కెట్ సంబంధిత ఆర్థిక నేరాల త్వరితగతి పరిష్కారానికి  ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా సెబీ తన సొంత సిబ్బందికి కూడా టెక్నికల్, బిహేవియరల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని వార్తలు