కోవిడ్-19 : యాంటీ వైరల్‌ ట్యాబ్లెట్ల మార్కెట్‌

29 Apr, 2020 17:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫావిపిరవిర్‌  ఔషధ ఎగుమతులు అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభం 

దేశీయ అనుమతులు కోసం దరఖాస్తు

సాక్షి, ముంబై: కోవిడ్ -19 చికిత్సలో కీలకమైన ఫావిపిరవిర్‌ ఔషధ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించామని దేశీ ఫార్మా కంపెనీ స్ట్రయిడ్స్ ఫార్మా సైన్స్‌ బుధవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 చికిత్సలో సానుకూల ఫలితాలనిచ్చిన ఈ  యాంటి  వైరల్ ఫావిపిరవిర్ టాబెట్లను వాణిజ్య ప్రాతిపదికన తయారీ, ఎగుమతులను ప్రారంభించినట్లు బుధవారం వెల్లడించింది. తద్వారా కరోనా వైరస్‌ సోకినవారి చికిత్సకు ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్లను ఎగుమతి చేస్తున్న తొలి దేశీ కంపెనీగా నిలవనున్నట్లు ప్రకటించింది. సౌకర్యవంత డోసేజ్ కింద 400 ఎంజీ. 200 ఎంజీబలంతో ఫావిపిరవిర్ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. అంతేకాదు ఈ ఔషధాన్ని దేశీయంగా వినియోగించేందుకు వీలుగా ఔషధ అధికారిక, నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేయనున్నట్లు  ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో  20 శాతం ఎగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ .3890 కోట్లకు పెరిగింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!)

తొలి దశలో భాగంగా గల్ఫ్‌ సహకార దేశాల (జీసీసీ)కు సరఫరా చేయనున్నట్లు  సంస్థ వెల్లడించింది. ఆయా దేశాలలో కరోనా వైరస్‌ సోకిన రోగులకు చికిత్సలో వీటిని వినియోగించనున్నట్లు వివరించింది. ఈ ఔషధ తయారీకి అవసరమయ్యే ఏపీఐల సరఫరాకు వీలుగా ఓ దేశీ ఫార్మా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోసం వారి చికిత్సా కార్యక్రమం కింద రోగులకు చికిత్స చేయడానికి ఈ ఉత్పత్తిని ప్రస్తుతం జిసిసి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జపనీస్‌ దిగ్గజం టొయమా కెమికల్‌ తయారీ ఎవిగాన్‌ ఔషధానికి జనరిక్‌ వెర్షన్‌. ఈ ఔషధాన్ని గతంలో జపాన్‌లో తలెత్తిన ఇన్‌ఫ్లుయెంజా నివారణకు రూపొందించారట. అయితే ఇటీవల ఈ  ఔషధ వినియోగం ద్వారా కోవిడ్‌-19 రోగులలో ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగుపడటాన్ని గుర్తించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. (ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!

మరిన్ని వార్తలు