అరుంధతి ఔట్!

30 Jun, 2016 16:34 IST|Sakshi
అరుంధతి ఔట్!

న్యూఢిల్లీ:  తదుపరి ఆర్‌బీఐ గవర్నర్ పదవికోసం అభ్యర్థి ఎంపికలో  ఎస్బీఐ  చైర్  పర్సన్ అరుంధతి   భట్టాచార్యకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు  కనిపిస్తోంది.  ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ  నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు గవర్నర్  రేసులో ఉన్న అభ్యర్థుల  జాబితాను  ప్రభుత్వం మరింత కుదించింది. ఈ షార్ట్ లిస్ట్ ను నాలుగు నుంచి  రెండుకు  కుదించిందని గురువారం నివేదికలు వెల్లడించాయి.

  అరుంధతి భట్టాచార్య,  ఊర్జిత్ పటేల్ పక్కన పెట్టిన ప్రభుత్వం  ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్  గోకర్న్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.   డోజౌన్స్ వైర్ అంచనాల ప్రకారం  అరుణ్  జైట్లీతో  చర్చించిన అనంతరం  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.  జులై  15వ  తేదీకల్లా ఈ నియామకం   పూర్తి కావచ్చని  చెబుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో  ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్  గోకర్న్ గట్టి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ప్రధానంగా ముందు  ఆరుగురుతోనూ,  ఇద్దరి తొలగించి ఆ తరువాత నలుగురు అభ్యర్థులతో కూడిన  జాబితాను  ఎంపిక చేసిన ప్రభుత్వం మరో ఇద్దరిని కూడా ఈ  జాబితా నుంచి తొలగించింది.  ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య,  ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్  ఉర్జిత్ పటేల్ ను పక్కన  పెట్టడంతో.. మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్  ఫైనల్ రేసులో   మిగిలారు.  మరి వీరిలో ఎవర్ని ఆ పదవి వరించనుది అనేది  ప్రస్తుతానికి సస్పెన్సే.


 

మరిన్ని వార్తలు