జీసీసీ నుంచి త్వరలో మారేడు షర్బత్!

23 Feb, 2016 01:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో సమ్మర్ డ్రింక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నన్నారి షర్బత్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఔషధ గుణాలున్న మారేడు (బిళ్వ) షర్బత్‌ను సరికొత్తగా తయారు చేస్తోంది. దీన్ని ఈ నెల 29న రాజమండ్రిలో విడుదల చేయనుంది. మారేడు పండ్ల గుజ్జు నుంచి దీన్ని తయారు చేస్తారు. మారేడు షర్బత్‌లో మధుమేహం, డయేరియా, అల్సర్‌ను నయం చేయడంతో పాటు బరువును తగ్గించడం, మలబద్ధకాన్ని నివారించే లక్షణాలున్నాయని చెబుతున్నారు.  750 మి.లీ. బాటిల్ ధరను రూ.100గా నిర్ణయించారు. తాజా ప్రొడక్టుకు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు జీసీసీ ఎండీ  రవిప్రకాష్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు