సన్‌ ఫార్మా బైబ్యాక్‌ ధర రూ.425

18 Mar, 2020 10:05 IST|Sakshi

రూ.1,700 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రూ.1,700 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని సన్‌ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌ను రూ.425 ధరకు మించకుండా దాదాపు నాలుగు కోట్ల ఈక్విటీ షేర్ల(మొత్తం షేర్ల సంఖ్యలో 1.67 శాతం వాటా)ను బైబ్యాక్‌ చేస్తామని  పేర్కొంది. ఈ షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన విధివిధానాలు, గడువు తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది. షేర్ల బైబ్యాక్‌ అనంతరం కంపెనీలో ప్రమోటర్ల వాటా 54.69 శాతం నుంచి 55.61 శాతానికి పెరుగుతుంది. ప్రజల వాటా 45.31 శాతం నుంచి 44.39 శాతానికి తగ్గుతుంది. ఈ బైబ్యాక్‌ ధర మంగళవారం ముగింపు ధర.రూ.371 తో పోల్చితే 14.5 శాతం అధికం.

మరిన్ని వార్తలు