క్యూ2 లో సన్‌ ఫార్మాకు భారీ లాభాలు 

7 Nov, 2019 19:29 IST|Sakshi

సాక్షి, ముంబై : హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్‌ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది.  క్యు2లో కంపెనీ ఎబిటా 17 శాతం దూసుకుపోయి రూ. 1790 కోట్లను చేరింది, కానీ మార్జిన్‌ మాత్రం ఫ్లాట్‌గా 22 శాతం వద్దే నమోదయింది. సమీక్షా కాలంలో కంపెనీ ఇతర ఆదాయాలు దాదాపు 43 శాతం పడిపోయి  రూ. 201 కోట్లకు చేరాయి.

దేశీయ మార్కెట్లో సన్ ఫార్మా నంబర్ 1 స్థానంలో ఉందని, ఫార్మా మార్కెట్‌ పరిశోధనా సంస్థ జూన్ -2019 నివేదిక ప్రకారం132,000 కోట్ల రూపాయలతో సుమారు 8.2 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంద సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.  క్యూ 2 ఆదాయాలపై సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్‌ సాంఘ్వి మాట్లాడుతూ, క్యూ 2,  పనితీరు నిరంతర వృద్ధి వేగాన్ని ప్రదర్శిస్తోందనీ, ఈ ఏడాది గైడెన్స్‌కు అనుగునంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా  దేశీయ విక్రయాలు 35 శాతం పెరిగి రూ. 2515 కోట్లను తాకగా, ఇతర మార్కెట్లలో విక్రయాలు 49 శాతం పెరిగి 16.1 కోట్ల డాలర్లను చేరాయి.ఇతర మార్కెట్లలో ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలో విక్రయాలు మంచి మెరుగుదల చూపాయి, ఇదే సమయంలో యూఎస్‌ విక్రయాలు మాత్రం యథాతధంగా కొనసాగాయి. ఈ త్రైమాసికంలో యుఎస్ అమ్మకాలు 424 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఫ్లాట్ . అయితే మొత్తం ఏకీకృత అమ్మకాలలో 30 శాతం వాటా ఉంది. మొదటి సగం అమ్మకాలు 763 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఈ గురువారం ముగింపులో షేరు దాదాపు మూడున్నర శాతం లాభపడి442.50 రూపాయల వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాంసంగ్‌ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కట్‌

హీరో మోటో తొలి బీఎస్-6  బైక్‌ 

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌ ఎలైట్‌, ధర ఎంతంటే

సెన్సెక్స్‌ జోరు,12 వేల ఎగువకు నిఫ్టీ

రియల్టీ బూస్ట్‌ : సూచీల జోరు

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

మారుతీ, టయోటా సుషో జాయింట్‌ వెంచర్‌

వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ‘రింగ్‌’

టాటా స్టీల్‌ లాభం 3,302 కోట్లు

వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం

జోయ్‌ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

రియల్టీ రంగానికి భారీ ఊరట

నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

బుల్‌ రన్‌,  ఆల్‌ టైం గరిష్టానికి సెన్సెక్స్‌

రికార్డు హైకి చేరిన సెన్సెక్స్‌

ఆ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జబ్బే..!

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

టైటాన్‌... లాభం రూ.312 కోట్లు

డాబర్‌ ఆదాయం రూ.2,212 కోట్లు

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌..!

పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు

పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు

టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌