భారీగా నష్టపోయిన సన్‌ఫార్మా

11 Aug, 2017 16:53 IST|Sakshi


ముంబై:  దేశీయ పార్మా దిగ్గజం ఫలితాల్లో   భారీగా కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సన్‌ఫార్మా  మార్కెట్‌ అంచనాలను మించి  భారీ నష్టాలను మూటగట్టుకుంది. క్యూ1 లో రూ. 425కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. 

జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి రూ .424.92 కోట్లు నష్టపోయినట్లు  సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బీఎస్‌ఈ ఫైలింగ్‌ లో తెలిపింది.  దాదాపు వెయ్యి కోట్ల లాభాలను ఆర్జించనుందని ఎనలిస్టులు అంచనావేశారు.   ఆదాయం  25శాతం క్షీణించింది.  అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ. 8,256 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ .6,208.79 కోట్లుగా నిలిచింది. ఎబిటామార్జిన్లు  17. 6 శాతంగా నిలిచాయి. 

మరోవైపు వన్‌ టైం లాస్‌గా రూ. 950.5 కోట్లను నష్టపోయినట్టు సన్‌ ఫార్మా  ప్రకటించింది.  జులై 2017 నెలలో మోడఫినిల్‌కు  సంబంధించి యాంటీట్రస్ట్ వ్యాజ్యానికి సంబంధించి మొత్తం 147 మిలియన్ డాలర్లు చెల్లించాలని కంపెనీ అంగీకరించిందని తెలిపింది.  ఈ ఫలితాల నేపథ్యంలో సన్‌పార్మా కౌంటర్‌  3శాతం  నష్టపోయింది.

>
మరిన్ని వార్తలు