సన్‌ఫార్మా : అంచనాలు మిస్‌

7 Feb, 2020 14:32 IST|Sakshi

పెరిగిన నికర వ్యయాల ప్రభావం

సన్‌ ఫార్మా లాభం 26 శాతం క్షీణత

రూ.3 మధ్యంతర డివిడెండ్‌

సాక్షి, ముంబై: ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్యాస్యూటికల్స్‌ నిరాశాజనక క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో  నికరలాభం 26 శాతం తగ్గి 913.52 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్‌ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని సన్‌ ఫార్మా  ఎండీ దిలిప్‌ సంఘ్వి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.7,657 కోట్ల నుంచి రూ.8,039 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

భారత్‌లో బ్రాండెడ్‌ వ్యాపారం బాగా ఉందని, క్యూ 3 తో ​​పాటు తొమ్మిది నెలల కాలానికి  రెండంకెల వృద్ధిని సాధించిందని సంఘ్వి తెలిపారు. ఆంకాలజీ ఉత్పత్తులకు చైనాలోని ఆస్ట్రాజెనెకాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో తమ పోర్ట్‌ఫోలియోను  పెంచుకోనున్నామన్నారు. ఏఐఓసీడీ అవాక్స్‌ డిసెంబర్‌, 2019 నివేదిక ప్రకారం భారత ఫార్మా మార్కెట్లో అగ్రస్థానం తమ కంపెనీదేనని, రూ1.4 లక్షల కోట్ల మార్కెట్లో 8.2 శాతం మార్కెట్‌ వాటా తమ చేతిలోనే ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు