సన్ఫార్మా చేతికి రష్యా కంపెనీ

12 Dec, 2016 15:03 IST|Sakshi
సన్ఫార్మా చేతికి రష్యా కంపెనీ

బయోసింటెజ్‌లో 85.1% వాటా కొనుగోలు..
డీల్ విలువ రూ.400 కోట్లు... 

న్యూఢిల్లీ: దేశీ ఫార్మా అగ్రగామి సన్ ఫార్మా.. రష్యా కంపెనీ జేఎస్‌సీ బయోసింటెజ్‌ను కొనుగోలు చేసింది. ఇరు కంపెనీల మధ్య ఈ ఒప్పందానికి సంబంధించి సంతకాలు పూర్తరుునట్లు బుధవారం ప్రకటించింది. బయోసింటెజ్‌లో 85.1 శాతం వాటాను చేజిక్కించుకుంటున్నామని.. ఇందుకోసం 2.4 కోట్ల డాలర్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన 3.6 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందని సన్‌ఫార్మా వెల్లడించింది. దీనిప్రకారం చూస్తే... మొత్తం డీల్ విలువ 6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.400 కోట్లు)గా లెక్కతేలుతోంది.

రష్యాతోపాటు సీఐఎస్(కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్) దేశాల్లో బయోసింటెజ్‌కు తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాలు ఉన్నాయని సన్‌ఫార్మా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానంగా హాస్పిటల్ ఔషధ విభాగంపై(డోసేజ్ ఫార్మ్స్, ఇంజెక్షన్లు, బ్లడ్ సబ్‌స్టిట్యూట్స్, బ్లడ్ ప్రిజర్వేటివ్‌‌స, జెల్స్, క్రీమ్స్ ఇతరత్రా) దృష్టిసారిస్తున్న ఈ రష్యా కంపెనీ 2015 ఏడాదిలో 5.2 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ‘వ్యూహాత్మక వర్థమాన మార్కెట్లలో పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగానే తాజా డీల్‌ను కుదుర్చుకున్నాం. దీనివల్ల రష్యా ఫార్మా మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు దోహదం చేస్తుంది’ అని సన్‌ఫార్మా వర్థమాన మార్కెట్ విభాగం హెడ్ అలోక్ సంఘ్వి పేర్కొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు