జూన్‌ 18కి ఏజీఆర్‌ కేసు వాయిదా

11 Jun, 2020 15:56 IST|Sakshi

5రోజుల్లోగా అఫిడవిట్ల ధాఖలు చేయండి: సుప్రీం కోర్టు

జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం: వోడాఫోన్‌ ఐడియా

టెలికాం సంస్థల ఏజీఆర్‌ కేసు విచారణను జూన్‌ 18​కి వాయిదా సుప్రీంకోర్టు  తెలిపింది. బకాయిల చెల్లింపులకు సంబంధించి 5రోజుల్లోగా అఫిడవిట్లను కోర్టులో ధాఖలు చేయాలని వోడాఫోన్‌ ఐడియాతో సహా ఇతర టెలికాం సంస్థలను ఆదేశించింది. టెలికాం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిల రూపంలో కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తంలో చెల్లింపులు ఒకేసారి తమ వల్ల కాదని టెలికాం సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ బకాయిలను 20 లేదా అంతకు ఎక్కువ కంటే ఎక్కువ సంవత్సరాల్లో వార్షిక వాయిదాల పద్దతిలో చెల్లించే ఫార్ములాకు అనుమతిని కోరుతూ టెలికమ్యూనికేషన్ విభాగం మార్చి 16న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ నేడు విచారణకు వచ్చింది. 

జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం: వోడాఫోన్ ఐడియా
బకాయిలు భారీగా ఉన్నాయని, అఫిడవిట్లు 3-4 రోజుల్లో  దాఖలు చేయలేమని వోడాఫోన్ ఐడియా సుప్రీం కోర్టకు విన్నవించుకుంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు, కనీస ఖర్చులకు కూడా సంస్థ వద్ద డబ్బు లేదని వోడాఫోన్‌ అపెక్స్‌ కోర్టు తెలిపింది. ఏ బ్యాంక్‌ గ్యారెంట్‌ ఇవ్వడానికి ముందురావలేని స్థితిలో కంపెనీ ఉందని వోడాఫోన్‌ తరపు లాయర్‌ తెలిపారు. కేంద్రం లెక్కల ప్రకారం వోడాఫోన్‌ ప్రభుత్వానికి రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో చట్టబద్ధమైన బకాయిలు చెల్లించనందుకు వడ్డీలు, జరిమానాలు ఉన్నాయి. 

మార్కెట్‌ ముగిసే సరికి వోడాఫోన్‌ ఐడియా షేరు నిన్నటి ముగింపు(రూ.10.82)తో పోలిస్తే 13.22శాతం నష్టపోయి రూ.9.39 వద్ద స్థిరపడింది. 
 

మరిన్ని వార్తలు