మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడండి

1 May, 2020 06:15 IST|Sakshi

ఆర్‌బీఐకి సుప్రీం  సూచన

న్యూఢిల్లీ: రుణాల వాయిదా చెల్లింపునకు సంబంధించి విధించిన మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడాలని రిజర్వ్‌ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు సూచించింది. ఈఎంఐలను కొంతకాలం వాయిదా వేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ ఇచ్చినప్పటికీ.. రుణగ్రహీతలకు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా అందిస్తున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే మారటోరియంనకు సంబంధించిన మార్చి 27నాటి ఆదేశాలు సరిగ్గా అమలయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.   కరోనా వైరస్‌పరమైన కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు  ఆర్‌బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు