అంబానీ బ్రదర్స్‌ డీల్‌కు సుప్రీం బ్రేక్‌

16 Apr, 2018 12:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో   కొట్టుమిట్టాడుతున్న   రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు  సుప్రీంకోర్టులో మరోసారి  ఎదురుదెబ్బ తగిలింది.  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్సకు చెందిన ఆస్తుల విక్రయ ఒప్పందానికి సుప్రీం బ్రేక్‌ వేసింది.  దీనికి సంబంధించి ఇటీవల ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)  ఇచ్చిన ఆర్డర్‌పై  స్టే విధించింది.   ఆర్‌కాం టవర్‌ సంస్థలో 4శాతం వాటా వున్న హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇన్వెస్ట్‌మెgట్స్‌ (మారిషియస్) లిమిటెడ్ సవాల్‌ను  కోర్టు స్వీకరించింది.  దీనిపై మైనారిటీ వాటాదారుల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.  దఈ వార్తలతో  స్టాక్‌మార్కెట్‌లో ఆర్‌కాం కౌంటర్‌ 2శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతోంది.

ఆస్తుల విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం లభించిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏప్రిల్ 5న ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించనున్నామని తెలిపింది.   కాగా స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్,మల్టీ ఛానెల్‌ నెట్‌వర్క్‌(ఎంసీఎన్‌ఎస్‌)విక్రయించేందుకు  గత ఏడాది  డిసెంబర్‌లో రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు