జీఎస్‌టీ ఎఫెక్ట్‌: ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్ట్‌లు కట్‌

8 Nov, 2017 19:17 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఉద్యోగులకు 400 అపార్ట్‌మెంట్లు, వెయ్యి కార్లు,  బంగారు నగలు దీపావళి  బహుమతి గా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన  సూరత్‌   వజ్రాల  వ్యాపారి  ఈ ఏడాది  జీఎస్‌టీ షాక్‌ తగిలింది. అందుకే దీపావళి  వచ్చిందంటే విలువైన బహుమతులతో   ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్లు ప్రకటించే ఆయన ఈసారి మిన్నకుండిపోయారు. అవును ‘బాస్‌ అంటే  ఈయనే’ అనే రీతిలో  సిబ్బందిపై కానుకల వర్షం కురిపించి  అందరి ప్రశంసలు అందుకున్న  సూరత్ వజ్రాల వ్యాపారి, హరే కృష్ణ  ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని సావ్జీ ధోలాకియా ఈ దీవపావళికి మాత్రం ఎలాంటి కానుకలు ఇవ్వకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒకే దేశం-ఒకే పన్ను అంటూ బీజీపీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  జీఎస్‌టీ  ఎఫెక్ట్ సూరత్ వజ్రాల వ్యాపారాలపై బాగా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చాలా మంది వ్యాపారులు ఇబ్బందుల్లోని నెట్టిందని చెబుతున్నారు. నల్లధనాన్ని నిరోధించే ప్రయత్నంలో ప్రభుత్వం చేపట్టిన చర‍్యలు  డైమండ్ , ఆభరణాల చిన్న వ్యాపారస్తులను దెబ్బకొట్టిందని టాక్స్‌ నిపుణులు చెప్పారు.  ఈ కారణంతోనే సావ్జీ ధోలాకియా ఎలాంటి కానుకలు ప్రకటించలేదని అంటున్నారు.  

నోట్ల రద్దు, అనంతరం తీసుకొచ్చి జీఎస్‌టీ చట్టం తమ వ్యాపారాన్ని బాగా దెబ్బతీసిందని  సూరత్‌ డైమండ్‌ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా నగదు లావాదేవీలపైననే ఆధారపడి ఉండే డైమండ్‌ వ్యాపారాన్ని నగదుకొరత, డిజిటల్‌ లావాదేవీలు ప్రభావాన్ని చూపుతున్నాయని సూరత్ పెట్టుబడిదారుడు మస్రాని  వ్యాఖ్యానించారు. సాధారణంగా ఒక్క సావ్జీ నేకాకుండా చాలామంది  ఉద్యోగులు భారీ  బహుమతులు,  పండుగ  బోనస్‌లు ఇవ్వడం ఆనవాయితీ అని  కానీ..  ఈ దీపావళికి చాలామంది  టాప్‌ డైమండ్‌ వ్యాపారులు కూడా అలా ఇవ్వలేకపోయారని వివరించారు. బంగారంపై 3 శాతం జిఎస్‌టీ, పీఎంఎల్‌ఏ నిబంధనలు ఈ సెక్టార్‌ను వ్యవస్థీకృతం చేసి, పారదర్శకతను తీసుకొచ్చినప‍్పటికీ, నిజమైన కొనుగోలుదారులకు, అమ్మకందారులతోపాటు మరికొంతమందికిఇబ్బందులను తెచ్చిపెట్టిందని  మరో  వ్యాపారి మణి  పేర్కొన్నారు.

కాగా ఏడాదికి రూ. 6వేల కోట్ల టర్నోవర్ ఉన్న  సావ్జీ తన  ఉద్యోగులు భారీ గిఫ్ట్‌లు, బోనస్‌లు ఆఫర్ల చేయడం తెలిసిందే.   ముఖ్యంగా 2015లో 1200 మందికి  నగలు, 491 ఫీయట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్  ఇళ్లను కానుకలుగా ఇచ్చారు. 2016లో 2 వేలమంది ఉద్యోగులకు డస్టన్ రడో గో, మారుతీ ఆల్టో కార్లు, నగలు కానుకగా ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది దీపావళికి ఇద్దామనే ఆలోచనతోనే ఈసారి  కానుకలను వాయిదావేసనంటూ ఈ అంచనాలను సావ్జీ  తోసిపుచ్చడం  విశేషం.
 

మరిన్ని వార్తలు