మార్కెట్‌లోకి సుజుకీ ‘ఇన్‌ట్రూడర్‌’ 2019 ఎడిషన్‌

6 Apr, 2019 00:49 IST|Sakshi

ధర రూ.1.08 లక్షలు 

ముంబై: వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా.. తన ‘ఇన్‌ట్రూడర్‌’ క్రూయిజర్‌ బైక్‌లో నూతన ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన గేర్‌ షిఫ్ట్‌ డిజైన్, అభివృద్ధిపరిచిన బ్రేక్‌ పెడల్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్‌ ధర రూ.1.08 లక్షలుగా కంపెనీ తెలిపింది.
 

‘స్టాండర్డ్‌ ఏబీఎస్, 155సీసీ ఇంజిన్, పూర్తి డిజిటల్‌ ఉపకరణాలతో ఈ బైక్‌ విడుదలైంది. క్రూయిజర్‌ను ఇష్టపడే యువతకు ఈ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ సరిగ్గా సరిపడే మోటార్‌సైకిల్‌గా భావిస్తున్నాం’ అని ఎస్‌ఎంఐపీఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దేవశిష్‌ హన్డా అన్నారు. 

మరిన్ని వార్తలు