ఆ బ్యాంకులో టెకీల హైరింగ్‌..

14 Jan, 2020 18:35 IST|Sakshi

బెంగళూర్‌ : ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ సబ్సిడరీ సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ తన బెంగళూర్‌ కార్యాలయం కోసం 200 మందికి పైగా ఉద్యోగులను నియమించేందుకు సన్నద్ధమవుతోంది. అమెరికాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌వీబీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ బెంగళూర్‌ కార్యాలయం కోసం ఇంజనీర్లు, సిస్టమ్‌ ఆర్కిటెక్ట్స్‌, డేటా అనలిస్టుల హైరింగ్‌కు సిద్ధమైంది. ఎంపికైన అభ్యర్థులు ప్రాడక్ట్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌ సహా పలు ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది.

అకౌంటింగ్‌, రెగ్యులేటరీ రిపోర్టింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ట్యాక్స్‌, ట్రెజరీ సపోర్ట్‌ వంటి సేవలను ఎస్‌వీబీ తమ క్లయింట్లకు అందచేస్తుంది. డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తూ నైపుణ్యాలను సంతరించుకున్న సిబ్బంది కోసం నియామక ప్రక్రియ చేపట్టామని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సీఈవో డేనియల్‌ బెక్‌ వెల్లడించారు. బెంగళూర్‌లో ఇటీవల సెంటర్‌ను ప్రారంభించిన ఈ బ్యాంకుకు అమెరికా సహా హాంకాంగ్‌, బీజింగ్‌ షాంఘై, లండన్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌ వంటి పలు ప్రపంచ నగరాల్లో 30 కేంద్రాల నుంచి తన కార్యకలాపాలను సాగిస్తోంది.

మరిన్ని వార్తలు