సిండికేట్‌ బ్యాంక్‌  ఎంసీఎల్‌ఆర్‌ పెంపు 

11 Oct, 2018 00:53 IST|Sakshi

న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్‌ బ్యాంక్‌ స్వల్పంగా 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది.  దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్లు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్‌ 10వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కాగా ఓవర్‌నైట్‌ (8.30), నెల (8.35), ఆరు నెలలు (8.60), ఏడాది (8.80) రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి.  

ఓబీసీ కూడా... 
పలు కాలపరిమితులకు సంబంధించి ఓబీసీ కూడా ఎంసీఎల్‌ఆర్‌ను 0.10 బేసిస్‌ పాయింట్ల వరకూ పెంచింది. గురువారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిటైల్‌ రుణాలకు బెంచ్‌మార్క్‌గా పేర్కొనే ఏడాది కాలపరిమితి రుణరేటు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది. అలాగే ఆరు నెలలు (8.70 శాతం), మూడు నెలలు (8.50 శాతం), నెల (8.45 శాతం) రుణ రేట్లు కూడా 0.10 శాతం పెరిగాయి. ఓవర్‌నైట్‌కు సంబంధించి రుణ రేటు 8.30 శాతానికి పెరిగింది. 

మరిన్ని వార్తలు