టారిఫ్‌ వార్‌ దెబ్బకు హార్లీ డేవిడ్‌సన్‌...

26 Jun, 2018 12:09 IST|Sakshi
హార్లీ డేవిడ్‌సన్‌ బైకులు (ఫైల్‌ ఫోటో)

అమెరికాకు, యూరోపియన్‌ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్‌ వార్‌ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్‌సైకిల్‌ తయారీదారి హార్లీ డేవిడ్‌ సన్‌ తగిలింది. టారిఫ్‌ వార్‌ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్‌సన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  తన బైక్‌ల కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అమెరికాకు కౌంటర్‌గా యూరోపియన్‌ యూనియన్‌ విధించే టారిఫ్‌ల నుంచి అది తప్పించుకోబోతుంది. ఈ విషయాన్ని హార్లీ డేవిడ్‌సన్‌ ప్రకటించింది.

గత కొన్ని రోజులుగా అమెరికాకు, ఇతర దేశాలకు భారీ ఎత్తున్న టారిఫ్‌ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లకు కౌంటర్‌గా ఆయా దేశాలు కూడా టారిఫ్‌లు విధిస్తున్నాయి. గత వారంలోనే అమెరికా ఉత్పత్తులపై యూరోపియన్‌ యూనియన్‌ 3.2 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. అమెరికా విధించిన స్టీల్‌, అ‍ల్యూమినియం టారిఫ్‌లకు ప్రతిగా ఈ టారిఫ్‌లను ప్రకటించింది. 

యూరోపియన్‌ యూనియన్‌ విధించిన టారిఫ్‌ ఉత్పత్తుల్లో హార్లీ డైవిడ్‌సన్‌ బైక్‌లు కూడా ఉన్నాయి. వీటి టారిఫ్‌లు కూడా 6 శాతం నుంచి 31 శాతం పెరిగాయి. దీంతో అమెరికా నుంచి ఎగుమతి అయ్యే ఒక్కో మోటార్‌ సైకిల్‌పై 2,200 డాలర్ల ప్రభావం పడనుంది. ఈ క్రమంలోనే హార్లీ డేవిడ్‌సన్‌ తమ ఉత్పత్తుల తయారీని అమెరికా నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు తరలించాని నిర్ణయించింది. ‘టారిఫ్‌లు పెరగడంతో, హార్లీ డేవిడ్‌సన్‌ వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఒకవేళ ఈ వ్యయాలను డీలర్లకు, రిటైల్‌ కస్టమర్లకు బదిలీ చేస్తే, తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హార్లీ డేవిడ్‌సన్‌ ఉత్పత్తులకు కస్టమర్‌ యాక్సస్‌ కూడా తగ్గిపోతుంది’ అని కంపెనీ రెగ్యులేటరీలో పేర్కొంది.

అమెరికా వెలుపలకు హార్లీ డేవిడ్‌సన్‌ ఉత్పత్తుల తయారీని బదిలీ చేసే ప్రక్రియకు 18 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే హార్లీ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘హర్లీ డేవిడ్‌సన్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగిచింది. నేను వారికోసమే పోరాడుతున్నాను. చివరికి వారు ఈయూకి ఎగుమతి చేసే ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు చెల్లించరు. వాణిజ్యపరంగా మాకు 151 బిలియన్‌ డాలర్ల నష్టం కలుగుతోంది. సుంకాలపై హార్లే ఓపికగా ఉండాలి’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు