ఒకే కంపెనీగా టాటా రక్షణ, ఏరోస్పేస్‌ విభాగాలు 

12 Apr, 2018 01:00 IST|Sakshi

టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ ఏర్పాటు  

ముంబై: వివిధ ఏరోస్పేస్, డిఫెన్స్‌ విభాగాలన్నింటినీ కలిపేసి ఒకే కంపెనీగా ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌ యోచిస్తోంది. టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ (టాటా ఏ అండ్‌ డీ)  కంపెనీ కిందకు అన్ని ఏరోస్పేస్, డిఫెన్స్‌ విభాగాలను తేనున్నామని టాటా సన్స్‌ తెలిపింది. దీనికి సంబంధించిన శాసన, నియంత్రణ ఆమోదాలు పొందే ప్రక్రియ కొనసాగుతోందని టాటా సన్స్‌  చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు.

రక్షణ, విమానయాన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్లాంట్లు తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్రలో ఉన్నాయని, ఈ ప్లాంట్లలో  మొత్తం 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్లాంట్లన్నింటినీ టాటా ఏ అండ్‌ డీ కిందకు తెస్తామని వివరించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా టాటా ఏ అండ్‌ డీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.     

మరిన్ని వార్తలు