ఆన్‌లైన్‌ గ్రాసరీ... హోరాహోరీ!

9 Nov, 2017 00:12 IST|Sakshi

ఎంట్రీకి ‘టాటా’ సన్నాహాలు

స్టార్‌క్విక్‌ బ్రాండ్‌ కింద సేవలకు రెడీ

1–2 నెలల్లో కార్యకలాపాలు..

తీవ్రమౌతోన్న పోటీ.. ఫ్లిప్‌కార్ట్, పేటీఎం కూడా ఆసక్తి

బిగ్‌బాస్కెట్, అమెజాన్‌లకు సవాల్‌

ఆన్‌లైన్‌ గ్రాసరీ మార్కెట్‌లో పోటీ అంతకంతకూ వేడెక్కుతోంది. కార్పొరేట్‌ దిగ్గజం  టాటా గ్రూప్‌ కూడా తాజాగా ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. స్టార్‌క్విక్‌ బ్రాండ్‌ కింద వచ్చే 1–2 నెలల కాలంలో సేవలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ట్రెంట్‌ హైపర్‌మార్కెట్‌కు ఆన్‌లైన్‌ చానల్‌గా పనిచేస్తుంది. ఎఫ్‌డీఐ నిబంధనల నేపథ్యంలో ట్రెంట్‌ అనుబంధ సంస్థ అయిన ఫియోర హైపర్‌మార్కెట్‌ (ఎఫ్‌హెచ్‌ఎల్‌) ద్వారా టాటా గ్రూప్‌ ఈ–గ్రాసరీ సేవలను అందించనుంది. ఎఫ్‌హెచ్‌ఎల్‌ ఇప్పటికే ట్రయల్స్‌ కూడా ప్రారంభించింది. ట్రెంట్‌ అనేది టాటా–టెస్కో జాయింట్‌ వెంచర్‌. టాటా గ్రూప్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీలోకి ఎంట్రీ ఇస్తే బిగ్‌బాస్కెట్, అమెజాన్‌లకు గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఆన్‌లైన్‌ గ్రాసరీ మార్కెట్‌ విషయమై టాటా గ్రూప్‌ ఎలాంటి కామెంట్‌ చేయలేదు.  

జూన్‌లో గ్రాసర్‌మ్యాక్స్‌ కొనుగోలు
టాటా గ్రూప్‌ జూన్‌లో ‘గ్రాసర్‌మ్యాక్స్‌’ సంస్థను కొనుగోలు చేసింది. దీంతో టాటా గ్రూప్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీలోకి అడుగుపెట్టినట్లయ్యింది. గ్రాసర్‌మ్యాక్స్‌ మేనేజ్‌మెంట్‌ను, టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్టార్‌క్విక్‌ సేవల కోసం వినియోగించుకునే అవకాశముంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ స్టార్‌ బ్యానర్‌ కింద డైలీ, మార్కెట్, హైపర్‌ అనే మూడు ఫార్మాట్‌లలో ఆఫ్‌లైన్‌ గ్రాసరీ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్‌ డైలీ సేవలను నిలిపివేయాలని సంస్థ భావిస్తోంది. వీటి స్థానంలో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. స్టార్‌ బ్యానర్‌కు 42 స్టోర్లు ఉన్నాయి.  

ఇదే తొలిసారి కాదు..
ఆన్‌లైన్‌ గ్రాసరీ మార్కెట్‌లోకి రావడం టాటా గ్రూప్‌కు ఇది కొత్తేమీ కాదు. 2015లోనే ఇది ఆన్‌లైన్‌ గ్రాసరీలోకి ఎంట్రీ ఇచ్చింది. యూకే రిటైల్‌ దిగ్గజం టెస్కోతో 50–50 జాయింట్‌ వెంచర్‌ ‘ట్రెంట్‌హైపర్‌ మార్కెట్‌’ను ఏర్పాటు చేసింది. ఇది ఈ–గ్రాసరీ షాప్‌  ఠీఠీఠీ.ఝy247ఝ్చటజ్ఛ్టు.ఛిౌఝ ను ప్రారంభించింది. ఇది ఎఫ్‌హెచ్‌ఎల్‌ నేతృత్వంలో ఉంది. కాగా, ప్రస్తుతం దీన్ని నిలిపేసింది. కాగా టెస్కో అనేది ప్రపంచపు మూడో అతిపెద్ద రిటైలర్‌. దీనికి ప్రపంచవ్యాప్తంగా 6,800 స్టోర్లు ఉన్నాయి. లాభాల్లో ఉన్న అతికొద్ది వెంచర్లలో ఇది కూడా ఒకటి.

అవకాశాలు అపారం..
దేశంలో ఆన్‌లైన్‌ గ్రాసరీ, ఫుడ్‌ మార్కెట్‌ విస్తరణ 1 శాతంలోపే ఉంది. అపార వృద్ధి అవకాశాలున్నాయి. అందుకే ఈ విభాగంపై దేశీ, విదేశీ సంస్థలు ప్రధానంగా దృష్టి కేంద్రకరించాయి. ఆన్‌లైన్‌ గ్రాసరీ, ఫుడ్‌ మార్కెట్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందనుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. 2020 నాటికి 141 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధితో మొత్తం ఆన్‌లైన్‌ రిటైల్‌ సేల్స్‌లో 12.5 % వాటాను (15 బిలియన్‌ డాలర్లు) ఆక్రమిస్తుందని తెలిపింది. దేశంలోని మొత్తం రిటైల్‌ బాస్కెట్‌లో ఫుడ్, గ్రాసరీ విభాగం 50% వాటా ఆక్రమించిందని పేర్కొంది. ఆన్‌లైన్‌ గ్రాసరీలో త్వరితగతి డెలివరీ  చాలా కీలకమని రిటైల్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఎలర్గిర్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ రుచి సల్లీ తెలిపారు. ఇందులో దిగ్గజంగా ఎదగాలంటే బలమైన లాజిస్టిక్స్, సప్లై చైన్‌ సామర్థ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు.  

ఫ్లిప్‌కార్ట్‌ రి–ఎంట్రీ.. పేటీఎం ఆసక్తి..
ఆన్‌లైన్‌ గ్రాసరీలోకి ఫ్లిప్‌కార్ట్‌ మళ్లీ వస్తోంది. ఇది ఇదివరకు 2015 అక్టోబర్‌లో నియర్‌బై యాప్‌ ద్వారా ఈ విభాగంలోకి వచ్చింది. కానీ తర్వాత ఇది మూతపడింది. ఇప్పుడు మళ్లీ రావడానికి ప్రయత్నిస్తోంది. ఇక బిగ్‌బాస్కెట్‌లో 200–300 మిలియన్‌ డాలర్లమేర నిధుల్ని పొందాలని పేటీఎం, అలీబాబాలతో చర్చలు జరుపుతోంది. అలాగే ఇన్వెస్టర్లు కూడా ఆన్‌లైన్‌ గ్రాసరీపై ఆసక్తిగా ఉన్నారు. బిగ్‌బాస్కెట్, జోపర్, షాడోఫాక్స్, నింజాకార్ట్, జోప్‌నౌ వంటి స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక అమెజాన్‌ కూడా ఈ–గ్రాసరీపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది.

మరిన్ని వార్తలు