20 ఏళ్ల తర్వాత, టాటాలు రీ-ఎంట్రీ

26 Jun, 2018 08:28 IST|Sakshi
వైట్‌ గూడ్స్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ గ్రూప్‌ ఏంటి అంటే? ఠక్కున టాటా గ్రూప్‌ అని చెప్పేస్తాం. ఈ గ్రూప్‌ సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 1998లో అప్పుడప్పుడే గృహవినియోగదారులు అలవాడు పడుతున్న వైట్‌ గూడ్స్‌ను అంటే రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్స్‌, డిష్‌ వాషర్స్‌ను విక్రయించడం ఆపేసింది. తాజాగా ఈ మార్కెట్‌ జోరందుకోవడంతో, మళ్లీ వైట్‌ గూడ్స్‌ మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆగస్టు నుంచి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, మైక్రోవేవ్‌ ఓవెనస్‌, డిష్‌ వాషర్స్‌ను ఓల్టస్‌ బెకో బ్రాండ్‌ కింద విక్రయించాలని యోచిస్తుందని గ్రూప్‌కు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. దీని కోసం వెయ్యి కోట్ల పెట్టుబడులను కూడా టాటా గ్రూప్‌ సిద్ధం చేసిందట. ప్రస్తుతం దేశీయంగా వైట్స్‌ గూడ్స్‌కు రూ.35 వేల కోట్ల మార్కెట్‌ ఉంది. ఈ ఓల్టస్‌ బ్రాండ్‌ కిందనే 1998 వరకు టాటాలు వైట్‌ గూడ్స్‌ను విక్రయించేవి. ఆ అనంతరం విక్రయాలను ఆపివేసి, 2003 వరకు ఎల్‌జీ, శాంసంగ్‌ల కోసం రిఫ్రిజిరేటర్లను తయారు చేసే కాంట్రాక్ట్‌ను మాత్రమే ఓల్టస్‌ కలిగి ఉంది. ప్రస్తుతం వైట్స్‌ గూడ్స్‌ మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని టాటాలు నిర్ణయించారు. 

ఆగస్టు నుంచి దశల వారీగా వైట్‌ గూడ్స్‌ను లాంచ్‌ చేయాలనుకుంటున్నట్టు ఓల్టస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ భక్షి చెప్పారు. అక్టోబర్‌లో ప్రారంభం కాబోయే పండుగ సీజన్‌ వరకు దేశవ్యాప్తంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్టు అంచనా వేస్తున్నారు. దీని కోసం ఓల్టస్‌, టర్కీకి చెందిన ఆర్సెలిక్‌ ఏఎస్‌లు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఉత్పత్తులను తొలుత థాయ్‌లాండ్‌, చైనా, టర్కీలలోని ఆర్సెలిక్‌ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకుంటామని, ఆ అనంతరం వచ్చే ఏడాది నుంచి గుజరాత్‌లో ప్రారంభించబోయే ప్లాంట్‌లో ఈ ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభిస్తామని భక్షి చెప్పారు. 2019 ద్వితీయార్థం నుంచి 10 లక్షల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, 5 లక్షల మైక్రోవేవ్‌ ఓవెన్లను రూపొందిస్తామని తెలిపారు. దీని కోసం రూ.240 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు కూడా పేర్కొన్నారు.  ప్రస్తుతం టాటా గ్రూప్‌ ఏసీ వ్యాపారాల్లో ఆధిపత్య స్థానంలో ఉంది. వైట్స్‌ గూడ్స్‌ రీ-లాంచింగ్‌తో ఈ మార్కెట్‌లోనూ ఆధిపత్యస్థానాన్ని కైవసం చేసుకోనుంది. బెకో-పార్టనర్స్‌ ఆఫ్‌ ఎవ్రీడే అనే ట్యాగ్‌లైన్‌లో ఓల్టస్‌ బెకో ఉత్పత్తులు మార్కెట్‌లోకి రానున్నాయని తెలుస్తోంది. ఓల్టస్‌ విక్రయాలను, పంపిణీని, సర్వీసులను చూసుకుంటే, ఆర్సెలిక్‌ టెక్నాలజీ, తయారీ సేవలను అందించనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా