ఫెస్టివ్‌ సీజన్‌ ఆఫర్‌ : టాటా టైగోర్‌ గెల్చుకోవచ్చు

10 Oct, 2018 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  టాటా మోటార్స్‌ కస్టమర్లకు పండగసీజన్లో వివిధ ఆఫర్లను ప్రకటించింది.  టాటా మోటార్స్ ప్రతి ఫోర్‌వీలర్‌   కొనుగోలుపై  ఫెస్టివల్ గిఫ్ట్‌లను ఆఫర్‌ చేస్తోంది.   తమకార్ల కొనుగోళ్లపై స్పెషల్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది.  అలాగే వారానికి ఒకటాటా టైగోర్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడాకల్పిస్తోంది.  ప్రతి వారం టాటా టైగోర్ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది.  అక్టోబర్ 31 వరకు  'ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్‌’ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. టాటా కార్ల కొనుగోలుపై అందిస్తున్న డిస్కౌంట్‌  వివరాలు ఇలా ఉన్నాయి.

టాటా టియాగో - రూ. 40,000
టాటా టైగోర్‌ - రూ.73,000
టాటా జెస్ట్ - రూ. 83,000
టాటా నెక్సన్ - రూ. 57,000
టాటా సఫారి స్టార్మ్ - రూ. 87,000
టాటా హెక్సా - రూ. 98,000


టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సపోర్ట్, ప్యాసింజర్ వాహనాల డివిజన్ ఎస్ఎన్ బార్మన్ మాట్లాడుతూ, ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా,తమ కస్టమర్ల ఆనంద వేడుకల్లో భాగమయ్యేందుకు  ఇది అద్భుతమైన సమయమన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు