టాటా, జయేం రేసింగ్‌ కార్లు వచ్చేసాయ్‌!

26 Oct, 2018 19:43 IST|Sakshi

టాటా-జయేం భాగస్వామ్యంలో తొలి మోడల్స్‌ లాంచ్‌

టియాగో జేటీపీ,  టిగోర్‌ జేటీపీ  కార్లు విడుదల

రూ.11వేలకే బుకింగ్‌

వచ్చే నెలనుంచి డెలివరీ

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ నాల్గవ అతిపెద్ద వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడం ద్వారా   రేసింగ్‌ కార్ల సెగ్మెంట్‌లోకి  దూసుకువచ్చింది.  ప్రధానంగా  జేటీపీ బ్రాండ్‌ కింద టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’, ‘ టిగోర్‌ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

కొత్త  మోడల్‌ కార్లు, బుకింగ్స్‌  ఈ రోజునుంచే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్‌  టియాగో జేటీపీ  ధర రూ. 6.39 లక్షలు, సెడాన్ టిగోర్‌ జేటీపీ  ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇవి పరిచయ ధరలని కంపెనీ తెలిపింది. టాటామోటార్స్‌,  కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్‌  సమ  భాగస్వామ‍్యంతో లాంచ్‌ అయిన మొట్టమొదటి కార్లు ఇవి  కావడం విశేషం

ఈ రెండు కార్లు మూడు-సిలిండర్ల 1.2 లీటర్ టర్బోచార్జెడ్ న్యూ జనరేషన్‌  రివోట్రోన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.  114 బిహెచ్‌పీ పీక్‌ పవర్‌ని అందిస్తుంది. 8 -స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో , 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లుగగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు