టాటా మోటార్స్‌ లాభాలు అదుర్స్‌

30 Jan, 2020 17:56 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆటో-మేజర్  టాటా మోటార్స్‌ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించి విశ్లేషకుల అంచనాలను బీట్‌ చేసింది. రూ. 850 కోట్లుగా వుంటుందని ఎనలిస్టులు అంచనా  చేశారు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 26,992 కోట్ల  రికార్డు నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం 6.82 శాతం క్షీణించి రూ. 71,676.07 కోట్లకు పరిమితమైంది.  అంతకుముందు ఏడాది ఇది రూ. 76,916 కోట్లు. గురువారం టాటా మోటార్స్  త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. స్వతంత్ర ప్రాతిపదికన కంపెనీ 1,039.51 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో 617.62 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. స్వతంత్ర మొత్తం ఆదాయం, 10,842.91 కోట్లుగా ఉంది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో, 6,207.67 కోట్లు. మూడవ త్రైమాసికంలో, ఎగుమతులతో సహా కంపెనీ స్వతంత్ర హోల్‌సేల్స్ 24.6 శాతం క్షీణించి 1,29,185 యూనిట్లకు చేరుకున్నాయి.

చైనాలో అమ్మకాలు బాగా పుంజుకోవడంతో  బ్రిటీష్  ఆధారిత సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్  లాభాలు 372 మిలియన్ల పౌండ్లకు, ఆదాయం 6.4 బిలియన్ పౌండ్లకు పెరిగింది.  ముఖ్యంగా  జాగ్వార్‌  ల్యాండ్‌ రోవర్‌ ఎవోక్‌ భారీ డిమాండ్‌ కూడా లాభాలను  ప్రభావితం చేసింది. అలాగే గ్లోబల్‌గా  జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన హవా కొనసాగిస్తుండగా, మార్కెట్ క్షీణత, దేశీయ మార్కెట్లోబీఎస్- 6 నిబంధనలు,   కంపెనీ పనితీరును ప్రభావితం చేసిందని టాటా మోటార్స్ తెలిపింది. భారతదేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఆటో పరిశ్రమ ప్రభావం కొనసాగుతోంది.మార్కెట్ షేర్లు పెరుగుతున్నప్పటికీ, లాభదాయకత ప్రభావితమైందని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు