టాప్‌ స్పీడ్‌లో టూవీలర్లు

3 Jan, 2018 01:00 IST|Sakshi

డిసెంబర్‌లో ద్విచక్ర వాహన విక్రయాల జోష్‌

టాటా మోటార్స్‌ అమ్మకాలు అప్‌; తగ్గిన ఫోర్డ్‌ దేశీ విక్రయాలు

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు డిసెంబర్‌ నెలలో జోరు చూపించాయి. హీరో మోటొకార్ప్, బజాజ్‌ ఆటో, సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వంటి కంపెనీలన్నీ వాటి వాహన విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్‌ దేశీ విక్రయాలు 53 శాతం వృద్ధితో 21,362 యూనిట్ల నుంచి 32,786 యూనిట్లకు ఎగశాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ దేశీ విక్రయాలు 16 శాతం వృద్ధితో 56,316 యూనిట్ల నుంచి 65,367 యూనిట్లకు పెరిగాయి.

మరొకవైపు టాటా మోటార్స్‌ దేశీ ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 30.96 శాతం వృద్ధితో 14,180 యూనిట్లకు పెరిగాయి. ఇక మొత్తం వాహన విక్రయాలు 52.48 శాతం వృద్ధితో 35,825 యూనిట్ల నుంచి 54,627 యూనిట్లకు ఎగశాయి.   ఫోర్డ్‌ ఇండియా దేశీ విక్రయాలు మాత్రం 8.6 శాతం క్షీణతతో 5,566 యూనిట్ల నుంచి 5,087 యూనిట్లకు తగ్గాయి. దీని మొత్తం వాహన అమ్మకాలు 27 శాతంమేర పెరిగాయి. ఇవి 23,470 యూనిట్ల నుంచి 29,795 యూనిట్లకు ఎగశాయి.  కాగా ‘లో బేస్‌ ఎఫెక్ట్‌’ వల్లే తాజా వృద్ధి కనిపించినట్లు వారు చెప్పారు. 

మరిన్ని వార్తలు