టాటా మోటర్స్‌ ప్లాంట్ల పునఃప్రారంభం: 7.5​0 శాతం లాభపడ్డ షేరు

2 Jun, 2020 16:39 IST|Sakshi

కంపెనీ అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో టాటామోటర్స్‌ షేరు మంగళవారం 7.70శాతం లాభంతో ముగిసింది. కేంద్రం నిర్దేశించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఝంషేడ్‌పూర్‌ ప్లాంట్‌తో సహా దేశవ్యాప్తంగా అ‍న్ని ప్లాంట్లలో 2020 మే 27 నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటుంది. అయితే సప్లై నుంచి కమర్షియల్‌ వాహన విభాగంలో 90శాతం సప్లయర్లు అనుమతులు పొందారు. 80శాతం కార్యకలాపాలు ప్రారంభించారు. మొత్తం డిమాండ్‌కు కేవలం 60శాతం మాత్రమే తక్షణ సప్లైకు సిద్ధంగా ఉన్నారు. 

లాక్‌డౌన్ సడలింపు తర్వాత చైనాలో వాహన అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రజలు షోరూమ్‌లకు తిరిగి వస్తుండంతో చాంగ్షు (చైనా)లోని కంపెనీ జాయింట్-వెంచర్ ప్లాంట్ మార్చి నుండి పనిచేస్తోంది. అలాగే బ్రిటన్‌లో సోలిహుల్ ఇంజిన్ ప్లాంట్లు, స్లోవేకియా ప్లాంట్, ఆస్ట్రియాలోని కాంట్రాక్ట్ అసెంబ్లీ లైన్లలో క్రమంగా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. 

ప్లాంట్ల పునఃప్రారంభ వార్తలతో షేరు మార్కెట్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో షేరు 8.50శాతానికి పైగా లాభపడి రూ.97.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 7.70శాతం లాభంతో రూ.96.50 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు