టాటా మోటార్స్ : ఉద్యోగులపై వేటు

16 Jun, 2020 09:35 IST|Sakshi

సాక్షి, ముంబై : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో టాటా మోటార్స్ లిమిటెడ్  కీలక నిర్ణయం తీసుకుంది. తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) యూనిట్లో ఉద్యోగాల  కోతకు నిర్ణయించింది. నష్టాలను పూడ్చుకునేందుకు, ఖర్చులు తగ్గింపు లక్ష్యంతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్లలో పనిచేస్తున్న1100 తాత్కాలిక ఉద్యోగులను జులైలో తొలగించనున్నామని కంపెనీ ప్రకటించింది. తద్వారా టాటా మోటార్స్ లగ్జరీ యూనిట్ జేఎల్ఆర్ 1 బిలియన్ పౌండ్ల (1.26 బిలియన్ డాలర్లు)ను  పొదుపు చేయాలని భావిస్తోంది.  (పదవ రోజూ పెట్రో షాక్)
 
టాటా మోటార్స్ తన వ్యాపారాలన్నింటినీ సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 2021నాటికి దేశీయ వ్యాపారంలో 5 బిలియన్ పౌండ్లను ఆదా చేయాలని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ తెలిపారు. ఇందులో 3.5 బిలియన్ పౌండ్లను ఇప్పటికే సాధించామని చెప్పారు. అలాగే గత ఏడాది 3 బిలియన్ పౌండ్లతో పోలిస్తే మూలధన వ్యయాన్ని 2.5 బిలియన్ పౌండ్లకు తగ్గించనుంది. అయితే తమ అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనా సహా యూరప్, అమెరికాలో ల్యాండ్ రోవర్ స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ డిఫెండర్, రేంజ్ రోవర్ ఎవోక్ అమ్మకాలు పుంజుకునే సంకేతాలున్నా యని బాలాజీ  చెప్పారు. (టాటా మోటార్స్‌ నష్టాలు 9,864 కోట్లు)

కరోనా, లాక్‌డౌన్ కారణంగా తమ లగ్జరీ కార్ల విక్రయాలు 30.9 శాతం తగ్గాయని జెఎల్ఆర్ ప్రకటించింది. టాటా మోటార్స్ ఆదాయంలో కీలకమైన జేఎల్ఆర్ ఆదాయం మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 27.7 శాతం క్షీణించినట్టు తెలిపింది.  మరోవైపు 2010 నుండి జేఎల్ఆర్ బాస్ గా కొనసాగుతున్న రాల్ఫ్ స్పేత్  ఈ సెప్టెంబరులో పదవినుంచి తప్పుకోనున్నారు.  

మరిన్ని వార్తలు