రతన్‌ టాటా పోస్టుపై ప్రశంసల వర్షం!

18 Mar, 2020 08:45 IST|Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (82) ఎక్కువగా సామాజిక సమస్యలపై స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పది నెలల వయసున్న ఓ శునకాన్ని ఎవరైనా దత్తత తీసుకోవాలని ఆయన కోరారు.  ‘ఈ శునకం పేరు సూర్. ఇప్పటికే దీనిని చాలా మంది దత్తత తీసుకున్నారు. కానీ, ఇప్పుడది ఒంటరి అయింది. సూర్‌ని ఎవరైనా దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే మీకు తెలిసిన ఎవరైనా దీనిని దత్తత తీసుకునేందుకు సహకరించండి. గతంలో ఇలాగే ఓసారి మైరా అనే శునకానికి సంబంధించి పోస్టు పెడితే నన్ను ఫాలో అవుతున్న వాళ్లు ఆ శునకానికి మేలు చేశారు’ అని టాటా పేర్కొన్నారు.

సూర్‌కు ఆశ్రయం కల్పించాలనే మంచి ఆలోచన కలిగిన వారు తన ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌లో పోస్ట్‌ చేయాలంటూ టాటా తెలిపారు. మైరాలాగే సూర్‌కు కూడా మంచి ఫ్యామిలీ దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక టాటా పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ తన వ్యాపారంలో బిజీగా ఉండే టాటా సామాజిక సమస్యలపై స్పందించే తీరు అభినందనీయమని ప్రశంసిస్తున్నారు.
 

After having changed families multiple times, “Sur” no longer has a family to look after her. One can still see the spirit and love she carries and the hope to belong somewhere. It is heartbreaking to get attached to someone never to see them again. The last time, all of you generously helped me find Myra a loving family. I hope together we can do the same for “Sur”. If you think you can open your home to her, or know someone who can, give it some serious thought and fill in the link in my bio. I truly wait for the day when we no longer have to do this again. #onehomeatatime

A post shared by Ratan Tata (@ratantata) on

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు