టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు: ఆఫర్లు, ప్లాన్లు ఇవే!

20 Aug, 2018 17:36 IST|Sakshi
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో గిగాఫైబర్‌ సేవలు ప్రజల్లోకి ఆవిష్కరిస్తున్న తరుణంలో, డీటీహెచ్‌ సర్వీసుల సంస్థ టాటా స్కై దానికి పోటీగా వచ్చేసింది. టాటా స్కై కూడా బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాల్లో లాంచ్‌ చేసింది. న్యూఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌,  ముంబై, థానే, పుణే, అహ్మదాబాద్‌, మిరా భాయందర్‌, భోపాల్‌, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు, 12 నెలల పాటు వాలిడిటీతో ఈ సేవలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఒక నెల టారిఫ్‌ ప్లాన్‌ 999 రూపాయలతో ప్రారంభమైంది. దీని కింద 5ఎంబీపీఎస్‌ స్పీడులో అపరిమిత డేటాను అందించనుంది. 5ఎంబీపీఎస్‌, 10ఎంబీపీఎస్‌, 30ఎంబీపీఎస్‌, 50ఎంబీపీఎస్‌ డేటా స్పీడులో సబ్‌స్క్రైబర్లకు ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి యూజర్‌కు కేటాయించిన అలవెన్స్‌ పడిపోతే, స్పీడ్‌ 1ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. 

టాటా స్కై ఒక నెల ప్లాన్‌..
ఒక నెల  డేటా ప్లాన్‌ 5ఎంబీపీఎస్‌, 10ఎంబీపీఎస్‌, 30ఎంబీపీఎస్‌, 50ఎంబీపీఎస్‌, 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 999 రూపాయలుకు, 1150 రూపాయలకు, 1,500 రూపాయలకు, 1,800 రూపాయలకు, 2,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్‌ చేయనున్నాయి. అయితే ఇన్‌స్టాలేషన్‌ ఫీజు కింద సబ్‌స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్‌ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.999కు, రూ.1,250కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 

టాటా స్కై మూడు నెలల ప్లాన్‌..
మూడు నెలల డేటా ప్లాన్‌ 5ఎంబీపీఎస్‌, 10ఎంబీపీఎస్‌, 30ఎంబీపీఎస్‌, 50ఎంబీపీఎస్‌, 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 2,997 రూపాయలుకు, 3,450 రూపాయలకు, 4,500 రూపాయలకు, 5,400 రూపాయలకు, 7,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్‌ చేయనున్నాయి. అయితే ఇన్‌స్టాలేషన్‌ ఫీజు కింద సబ్‌స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్‌ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.2,997కు, రూ.3,750కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 

టాటా స్కై 12 నెలల ప్లాన్‌..
12 నెలల డేటా ప్లాన్‌ 5ఎంబీపీఎస్‌, 10ఎంబీపీఎస్‌, 30ఎంబీపీఎస్‌, 50ఎంబీపీఎస్‌, 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 11,988 రూపాయలుకు, 13,800 రూపాయలకు, 18,000 రూపాయలకు, 21,600 రూపాయలకు, 30,000 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్‌ చేయనున్నాయి. అయితే ఇన్‌స్టాలేషన్‌ ఫీజు కింద సబ్‌స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్‌ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.11,988కు, రూ.15,000కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 
ఐదు నెలలు, తొమ్మిది నెలల వాలిడిటీతో మరో రెండు ప్లాన్లు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా