'మిస్త్రీ చేసింది క్షమించరాని తప్పు'

27 Oct, 2016 19:51 IST|Sakshi
'మిస్త్రీ చేసింది క్షమించరాని తప్పు'

న్యూఢిల్లీ: టాటా సన్స్ సైరస్ మిస్త్రీల మధ్య పోటాపోటీ మాటల యుద్ధం మొదలైంది. తనకు వద్దన్నా బాధ్యతలు కట్టబెట్టి అనంతర స్వేచ్ఛ లేకుండా చేశారని, ప్రతి విషయంలో రతన్ టాటా జోక్యం చేసుకున్నారని, బోర్డు సభ్యులెవరూ తన మాటను సరిగా వినలేదని సైరస్ మిస్త్రీ చెప్పగా.. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని టాటా సన్స్ కొట్టి పారేసింది. టాటా సన్స్ బోర్డు సైరస్ మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని చెప్పింది. సైరస్ మిస్త్రీ చేసిన ఏ ఆరోపణలకు కూడా ఆధారాలే లేవని, ఆయన తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్యేనని గురువారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

'టాటా సన్స్ బోర్డు తన చైర్మన్కు అవకాశాలను సమన్వయం చేసుకునేందుకు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన స్వయం అధికారాన్ని ఇచ్చింది. కానీ, కంపెనీ విలువలకు, పద్ధతికి మిస్త్రీ దూరంగా జరిగారు. మొత్తానికి పలు కారణాల మూలంగా మిస్త్రీ బోర్డు సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడం దురదృష్టకరం' అని కూడా ఆ ప్రకటన పేర్కొంది. మిస్త్రీ కంపెనీ ప్రతిష్టను ఉద్యోగుల దృష్టిలో కళంకితం చేశారు. అది క్షమించరానిది' అని కూడా లేఖలో చెప్పారు.

మరిన్ని వార్తలు