గ్రూప్‌ కంపెనీలకు టాటాసన్స్‌ చేయూత

18 Jul, 2020 15:27 IST|Sakshi

కోవిడ్‌-19 సవాళ్ల నేపథ్యం 

1బిలియన్‌ డాలర్ల నిధుల కేటాయింపు

టాటా గ్రూప్‌ బోర్డు నిర్ణయం

కోవిడ్‌-19 ధాటికి కుదేలైన గ్రూప్‌ వ్యాపారాలు కోలుకునేందుకు నిధుల సాయం చేయాలని టాటాగ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్ భావిస్తోంది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో టాటాల ఎయిర్‌లైన్స్, హోటల్, హౌసింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 1బిలియన్‌ డాలర్‌ నిధులను మూలధన కేటాయింపు రూపంలో ఆయా వ్యాపార కంపెనీల్లోకి జొప్పించాలని టాటాబోర్డు నిర్ణయం తీసుకుంది. టాటాగ్రూప్‌ సాధారణ బోర్డు సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిర్వహించారు. కరోనా ఎఫెక్ట్‌తో పాటు సుప్రీంకోర్టు ఏజీఆర్‌తో తీర్పుతో దివాళా దిశగా సాగుతున్న టెలికాం సర్వీసెస్‌కు అధిక నిధులను కేటాయించాలని బోర్డు భావిస్తోంది. అలాగే టాటా పవర్‌లో రుణ తగ్గింపుపై కూడా చర్చించింది. 

టాటా గ్రూప్‌లో ఒక్క టీసీఎస్‌ తప్ప మిగిలిన ప్రతీ వ్యాపారంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కోంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా యూరప్‌లో టాటా స్టీల్‌, జాగ్వర్‌ లాండ్‌ లోవర్‌ ప్లాంట్‌ను కొంతకాలం పాటు నిలిపివేశాయి. తర్వాత పరిమిత సంఖ్య స్థాయి కార్మికులతో ఉత్పత్తిని ప్రారంభించాయి. జేఎల్‌ఆర్‌ సీఈవో రాల్ఫ్ స్పెత్  పదవీ కాలం ఈ సెప్టెంబర్‌లో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో తర్వలో కొత్త సీఈఓను ప్రకటించనుంది.

లాక్‌డౌన్‌తో పూర్తిగా దెబ్బతిన్న ఎయిర్‌లైన్‌‍్స, హోటల్‌ వ్యాపారాలపై కూడా చర్చించింది. గతనెలలో తన ఎయిర్‌లైన్‌ కంపెనీలో అదనపు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా రానున్న రోజుల్లో ఎయిర్‌లైన్‌ వ్యాపారం మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని బోర్డు అంచనావేసింది. 
టాటాగ్రూప్‌ యాజమాన్యం ఆర్థిక సంవత్సరం 2020లో రూ.20వేల కోట్లను డివిడెండ్ల రూపంలో పొందింది.

మరిన్ని వార్తలు