టాటా స్టీల్‌ నష్టాలు 1,096 కోట్లు

30 Jun, 2020 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉక్కు రంగ దిగ్గజ కంపెనీ, టాటా స్టీల్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,096 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.2,431 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.42,914 కోట్ల నుంచి రూ.35,086 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ప్రకటించింది.

► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.38,729 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు గత క్యూ4లో రూ.33,272 కోట్లకు తగ్గాయి.  
►ఉక్కు ఉత్పత్తి(కన్సాలిడేటెడ్‌) సీక్వెన్షియల్‌గా 7 శాతం ఎగసి 7.37 మిలియన్‌ టన్నులకు చేరింది. భారత్‌లో ఉక్కు ఉత్పత్తి 6 శాతం వృద్ధితో 4.73 మిలియన్‌ టన్నులకు చేరింది.  
►కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా భారత్‌తో పాటు యూరప్, ఆగ్నేయాసియా, కెనడా ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి.  
►గత క్యూ4లో యూరప్‌ విభాగం నిర్వహణ లాభం రూ.65 కోట్లుగా ఉంది. అంతక్రితం క్యూ4 లో రూ.956 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి.  
►పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 74 శాతం తగ్గి రూ.2,720 కోట్లకు, ఆదాయం 11 శాతం తగ్గి రూ.1,39,817 కోట్లకు చేరాయి.  
►భారత విభాగం ఉక్కు ఉత్పత్తి 8% పెరిగింది.  
►ఈ ఏడాది మార్చి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.17,745 కోట్ల మేర ఉన్నాయి.
►ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా స్టీల్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.321 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు