ఏంటా లాభాలు..

14 Sep, 2015 00:52 IST|Sakshi

డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌తో పోలిస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలున్నాయని చెప్పొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65 శాతం కంటే అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. దీంతో ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఏడాదిలోగా వైదొలిగితే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభ పన్ను, ఆ పన్నుపై 3 శాతం సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే బ్యాంకు డిపాజిట్లలో వచ్చే వడ్డీ ఆదాయంపై మీ శ్లాబును బట్టి పన్ను భారం ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. దీంతో డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజన ఆకర్షణను కోల్పోయాయి.

మరిన్ని వార్తలు