పన్నులు సజావుగా వసూలు చేయాలి

7 Sep, 2017 01:20 IST|Sakshi
పన్నులు సజావుగా వసూలు చేయాలి

రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌  
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు సాఫీగా సాగాలని, ఈ ప్రక్రియలో పన్ను చెల్లింపుదారు ఎటువంటి అసౌకర్యానికీ గురికారాదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు.  ఇండియన్‌ రెవెన్యూ సేవల (కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌) 67వ (2015) బ్యాచ్‌ ప్రొబెషనరీస్‌  బుధవారం ఇక్కడ రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగిస్తూ,  దేశ నిర్మాణంలో రెవెన్యూ వసూళ్ల విభాగానికి కీలక పాత్ర అని వివరించారు.  అర్థశాస్త్ర పితామహునిగా పేరొందిన చాణుక్యుని ఉటంకిస్తూ, ‘‘పుష్పాల నుంచి తగిన స్థాయిలోనే తేనెటీగ మకరందాన్ని గ్రహిస్తుంది. తద్వారా పుష్పాలకూ ఎటువంటి నష్టం కలుగదు. అలాగే తేనెటీగకూ తగిన ఆహారం లభిస్తుంది. ఇక్కడ రెండూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా మనగలుగుతాయి’’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది.

>
మరిన్ని వార్తలు