ఐటీ ఉద్యోగాల్లో టీసీఎస్ టాప్

24 Jul, 2015 09:44 IST|Sakshi
ఐటీ ఉద్యోగాల్లో టీసీఎస్ టాప్

చెన్నై: ఐటీ-బీపీవో రంగంలో ఉద్యోగాల కల్పనలో టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచాయి. ఇందుకు సంబంధించి ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ 20 టాప్ కంపెనీలతో జాబితాను విడుదల చేసింది. 2014-15లో మొత్తం ఐటీ-బీపీవో ఉద్యోగుల్లో మూడోవంతు మంది...సుమారు 12.5 లక్షల మంది ఈ 20 సంస్థల్లోనే ఉన్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. విప్రో, ఇన్ఫోటెక్, హెచ్సీఎల్ టెక్, క్యాప్ జెమిని, హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, ఐగేట్, ఎంఫసిస్ తదితర కంపెనీలు ఈ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయి.

 

మరిన్ని వార్తలు