లక్కీ ఫెలోస్‌ : టాప్‌-20లో టీసీఎస్‌

21 Feb, 2020 16:57 IST|Sakshi

‘గ్రేట్‌  ప్లేస్‌ టు వర్క్‌’  జాబితాలో భారతీయ సంస్థ టీసీఎస్‌

 అమెరికాలోని టాప్ 20 కంపెనీలలో చోటు దక్కించుకున్న దేశీయ టెక్‌ దిగ్గజం

న్యూయార్క్ :  భారతీయ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) అరుదైన ఘనతను సొంతం  చేసుకుంది. అమెరికాలో అతి  పెద్ద ఉత్తమం కంపెనీల జాబితాలో చోటు చేసుకుంది.  పనిచేయడానికి అనువైన సంస్థల టాప్‌ 20 సంస్థల సరసన చేరింది.  ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్‌’  పేరుతో శుక్రవారం  ప్రకటించిన వివరాల ప్రకారం 2020  ఫార్చ్యూన్  కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టీసీఎస్‌.  సీఎస్‌ మేనేజ్‌మెంట్‌ టీం,  వైవిధ్యాన్ని ఒక ఆస్తిగా కంపెనీ స్వీకరించిన వైనం, ఉద్యోగుల బలాలు, వృత్తి వృద్ధి అవకాశాలను గుర్తించడంలోటీసీఎస్‌ కృషికి ఈ గుర్తింపు లభించినట్టు సర్వే తెలిపింది. 2020 ఫార్చ్యూన్  కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ  సంస్థ టీసీఎస్‌. 

అమెరికాలో మెగా కంపెనీలతో పాటు యుఎస్‌లో పనిచేసే టాప్ 20  టీసీఎస్‌ ఒక్కటే నిలవడం విశేషం.  దిగ్గజ కంపెనీల్లో ఒకరిగా ఈ గుర్తింపును సాధించడం  గర్వంగా వుందని టీసీఎస్‌ ఉత్తర అమెరికా, యుకె, యూరప్ అధ్యక్షుడు సూర్య కాంత్  సంతోషం వ్యక్తం చేశారు. తమ కస్టమర్లకు ఫస్ట్-క్లాస్ సేవలు అందించేలా చురుగ్గా పనిచేసే ఉద్యోగులను ఎంపిక చేశామనీ, అందరికీ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన పని సంస్కృతిని సృష్టించామని కాంత్ తెలిపారు. 

‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’  పేరుతో నిర్వహించిన అధ్యయనంలో  33వేలకు పైగా ఉద్యోగుల్లో, 60కి పైగా అంశాలను అంచనా వేసింది. ముఖ్యంగా ఉద్యోగులు తమ బాస్‌లను ఎంతవరకు విశ్వసిస్తారు, ప్రజలతో వ్యవహరించే తీరు, గౌరవం, కార్యాలయ నిర్ణయాల వైఖరి, టీమ్‌ మధ్య స్నేహభావం ఎంత లాంటి అంశాలను పరిశీలించింది. పదిమందిలో  ఏడుగురు  (72శాతం)  ఉద్యోగులు పని చేయడానికి  టీసీఎస్‌ గొప్ప సంస్థ అని కొనియాడారు. పది మందిలో ఎనిమిది మంది (80శాతం) వర్క్‌, లైఫ్‌ సమతుల్యత  చాలా బావుందని,  అవసరమైనప్పుడు పనికి దూరంగా ఉండటానికి  అవకాశం కల్పించారని చెప్పారు. పది మందిలో దాదాపు తొమ్మిది (85శాతం) చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. కాగా గ్లోబల్‌ టెక్‌ సేవల్లో దూసుకుపోతున్న టీసీఎస్‌ 20వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించు కుందని ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.  అలాగే 2019లో యుఎస్ ఉద్యోగులలో 90 శాతం మంది తాజా డిజిటల్ టెక్నాలజీస్, టూల్స్, ప్లాట్‌ఫామ్‌లలో అప్‌గ్రేడ్‌ అయినట్టు వెల్లడించింది.  2014 నుండి, ఐటి సర్వీసెస్, కన్సల్టింగ్ రంగంలో అమెరికాలో టీసీఎస్‌ది కీలక పాత్ర.  

మరిన్ని వార్తలు