టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు

14 Jul, 2020 13:15 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)  శుభవార్త అందించింది.  పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్  ద్వారా ఏకంగా 40 వేల మందికి  ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని  ప్రకటించింది.  కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభ మధ్య జూన్ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ  ఈ నిర్ణయం తీసుకోవడం  విశేషం.

ఇండియాలో 40 వేలమంది లేదా 35-45 వేల మధ్య అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీసీఎస్‌ గ్లోబల్ హెచ్ఆర్‌డీ హెడ్ మిలింద్ లక్కాడ్ వెల్లడించారు. వీరిలో 87శాతం మంది తమ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాంలలోయాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు. వారానికి 8 నుంచి 11 వేల మందిని ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఫ్రెషర్లతోపాటు అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌ను కీలక ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని లక్కాడ్ తెలిపారు.

అయితే దేశీయంగా గత ఏడాది మాదిరిగానే 40వేల మందిని ఎంపిక చేయనున్న టీసీఎస్‌ అమెరికాలో నియామకాలను మాత్రం దాదాపు రెట్టింపు చేయనుంది. హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న కంపెనీ ఈ  నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. అలాగే అమెరికాలో టాప్ 1 బిజినెస్‌ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనుంది.  కాగా టీసీఎస్ 2014 నుంచి 20 వేల మందికి పైగా అమెరికన్లను టీసీఎస్‌ నియమించుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు