టెక్‌ మహీంద్రా బై బ్యాక్‌

21 Feb, 2019 13:18 IST|Sakshi

సాక్షి, ముంబై :  సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)  చేయనున్నామని టెక్‌  దిగ్గజం టెక్‌ మహీంద్రా  ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా లిమిటెడ్‌ బోర్డు బైబ్యాక్‌ప్రతిపాదను ఆమోదం తెలిపింది రూ. 1956 కోట్ల విలువైన  షేర్ల కొనుగోలుకు ఆమోదం లభించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గురువారం తెలిపింది.

షేరుకి రూ. 950 ధర మించకుండా దాదాపు 2.06 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది 2.1 శాతం ఈక్విటీ వాటాకు సమానం. ఇందుకు రూ. 956 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత ట్రేడింగ్‌ రేటుకు 14.59 ప్రీమియం ధరలో బై బ్యాక్‌ చేపడుతున్నట్టు  పేర్కొంది. బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం టెక్‌ మహీంద్రా 2.1 శాతం లాభాల్లో  రూ.830 స్థాయి వద్ద కొనసాగుతోంది.  అంతకుముందు రూ.840 వద్ద  52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు